‘ఉప్పెన‌’ కోసం తారక్ స‌పోర్ట్.. చివ‌రి నిమిషంలో సుక్కు మార్పులు

  • IndiaGlitz, [Tuesday,February 02 2021]

సాయితేజ్ సోద‌రుడు, మెగా క్యాంప్ డెబ్యూ హీరో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్రం ‘ఉప్పెన‌’. గ‌త ఏడాది ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ ప్ర‌భావం కార‌ణంగా వాయిదా ప‌డింది. థియేట‌ర్స్ మూత ప‌డ‌టం ఇతర కార‌ణాల‌తో ఒక‌నొక సంద‌ర్భంలో ఉప్పెన చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేస్తార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో కోవిడ్ ప‌రిస్థితుల నుంచి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ థియేట‌ర్స్‌ను ర‌న్ చేయాలంటూ, కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల‌ను జారీ చేయ‌డంతో ‘ఉప్పెన‌’ ఫిబ్ర‌వ‌రి 12న థియేటర్స్‌లో రావ‌డానికి సిద్ధ‌మైంది.

సినిమా టీజ‌ర్‌, పాట‌ల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు నిర్మాత‌గా, రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన సుకుమార్ చివ‌రి నిమిషంలో స‌న్నివేశాల ఆర్డ‌ర్స్ మార్చ‌డం, మ‌రింత షార్ప్‌గా ఎడిట్ చేయ‌డం వంటి ప‌నుల‌పో ఫోక‌స్ చేసి ఔట్‌పుట్‌ను మ‌రింత బెట‌ర్‌గా వ‌చ్చేలా చేసుకుంటున్నాడ‌ట‌. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సినిమా రూపొందింది.

More News

రాజ‌శేఖ‌ర్‌ను డైరెక్ట్ చేయ‌నున్న జీవిత‌....

సినీ రంగానికి చెందినవాళ్ల‌కి, సినీ ప్రేక్ష‌కాభిమానుల‌కు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

రొమాంటిక్ యాంగిల్‌..‘పుష్ప’

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి స‌మీపంలో మారేడు మిల్లిలో షూటింగ్ జ‌రుగుతోంది.

ఫిబ్రవరి 5న నెట్ 5లో అంతర్జాతీయ చిత్రం '8119 మైల్స్' ప్రీమియర్

ప్రపంచం నలుమూలల నుండి కంటెంట్‌ను ప్రదర్శించే ప్రముఖ వెబ్ ప్లాట్‌ఫామ్‌లలో నెట్ 5 ఒకటి అన్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. తొలిసారిగా గ్రీన్ ఛానల్..

హైదరాబాద్ మెట్రో ఓ మహాత్కార్యానికి వేదిక కాబోతోంది. తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సలో తన వంతు సాయాన్ని అందించబోతోంది.

`లవ్‌స్టోరీ` `టక్ జగదీష్` సినిమాల మధ్య వివాదం సమసినట్టేనట..

`లవ్‌స్టోరీ`, `టక్ జగదీష్` సినిమాల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య విడుదల తేదీల విషయంలో వివాదం తలెత్తింది.