ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న ఎన్టీఆర్!?

  • IndiaGlitz, [Tuesday,January 28 2020]

అవునా.. ఎన్టీఆర్.. ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాడా..? అని ఆశ్చర్యపోతున్నారా..? ఎస్ మీరు వింటున్నది నిజమే. జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నాడట. మరీ నమ్మశక్యంగా లేదు కదా.. ఇదంతా రియల్ కాదండోయ్ బాబూ.. రీల్‌లో మాత్రమే!. అసలు చక్రాలేంటి..? ఢిల్లీ ఏంటి..? అనే విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

‘RRR’ తర్వాత..!

రియల్ ‌లైఫ్‌ వరకూ అప్పుడెప్పుడో 2009 ఎన్నికల్లో తప్ప ఇంతవరకూ రాజకీయాల జోలికి జూనియర్ పోలేదన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయన్ను రాజకీయాల్లోకి సొమ్ము చేసుకునే ప్రయత్నం కొందరు చేస్తున్నారని హడావుడి కూడా జరిగింది. అయితే రాజకీయాల్లోకి రావాల్సిన టైమ్ ఇంకా రాలేదనుకున్నారో లేకుంటే ప్రస్తుతానికి సినిమాలే చాల్లే అని అనుకున్నారో తెలియట్లేదు కానీ.. మిన్నకుండిపోయాడు. ఇక అసలు విషయానికొస్తే.. దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’. ఈ చిత్రం అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఢిల్లీలో బుడ్డోడు చక్రం!

తాజా సమాచారం మేరకు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుందని.. అది కూడా మునుపెన్నడూ లేని విధంగా పొలిటికల్ టచ్ ఉంటుందని తెలుస్తోంది. సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  టైటిల్ కాస్త విచిత్రంగా అనిపించినా ‘అ’ అంటే మాటల మాంత్రికుడికి సెంటిమెంటన్న విషయం తెలిసిందే. అందుకే.. తన తదుపరి సినిమా కూడా ‘అ’తో ఉండాలని అనుకున్నారట. ఈ టైటిల్‌ మహాభారతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే దాన్ని తనదైన శైలిలో మలుచుకుని పొలిటికల్ టచ్ ఇస్తున్నాడట.

రాష్ట్ర రాజకీయాలు కాకుండా హస్తినా (ఢిల్లీ)లో బుడ్డోడితో చక్రం తిప్పించబోతున్నాడట మాటల మాంత్రికుడు. ఢిల్లీ రాజకీయాల్లో మొత్తం ఎన్టీఆర్ చేతిలో ఉంటుందట. ఇటు రాష్ట్రం.. అటు ఢిల్లీ రాజకీయాలతో సినిమాలో గట్టిగానే హడావుడి ఉంటుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పుకార్లు నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో ఏ మాత్రం నిజముందో బుడ్డోడు-మాంత్రికుడికే తెలియాల్సి ఉంది.

More News

జగన్ ఎఫెక్ట్: నవ్వుతూ మంత్రి పదవులు వదిలేస్తాం!!

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

‘మా’లో మళ్లీ రగడ.. న‌రేశ్‌కు వ్య‌తిరేకంగా లేఖ రాసిన ఈసీమెంబ‌ర్స్‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు ఇప్ప‌ట్లో స‌ద్దు మ‌ణిగేలా క‌న‌ప‌డం లేదు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌రేశ్‌పై ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్స్ నిర‌స‌న గ‌ళ‌మెత్తారు.

'అల వైకుంఠపురములో' ఈ స్థాయి కలెక్షన్లు సాధింస్తుందని మొదట చెప్పింది మెగాస్టారే - అల్లు అర్జున్

"ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు.

దర్శకుడిగా మారుతున్న నిర్మాత విశ్వనాథ్ తన్నీరు

సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు ఇటీవల  "యమ్ 6" వంటి  సస్పెన్స్  థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు, ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో

ఫిబ్రవరి 7న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా