ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’.. ప్రకటన వచ్చేసింది

  • IndiaGlitz, [Tuesday,March 09 2021]

'బిగ్‌బాస్’ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బిగ్‌బాస్ సీజన్ 1తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలిసారిగా బుల్లితెరపై అడుగుపెట్టినప్పటికీ అదరగొట్టేశాడు. హోస్ట్ అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తరువాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. బిగ్‌బాస్ సీజన్ 4 కూడా పూర్తైంది. ప్రతి సీజన్ సమయంలోనూ ఎన్టీఆర్ హోస్ట్‌గా వస్తే బాగుండని ఆయన అభిమానులే కాదు.. బిగ్‌బాస్ ప్రేక్షకులంతా కోరుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తిరిగిన టెలివిజన్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇన్నాళ్లకు తిరిగి బుల్లితెర ప్రేక్షకుల కోరిక తీరబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ప్రముఖ ఛానల్‌లో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలొచ్చినప్పటికీ అయితే కార్యక్రమం ఏంటనేది మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. కానీ తాజాగా క్లారిటీ వచ్చేసింది. జెమిని ఛానల్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ‘‘ఎవరు మీలో కోటీశ్వరులు మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు త్వరలో మీ జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి’’ అని సదరు జెమిని టీవీ యాజమాన్యం విడుదల చేసింది. ఈ కార్యక్రమానికే ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. కాగా.. దీనికి సంబంధించిన ప్రోమోను ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

More News

'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్..!

పిరియాడిక్ మూవీస్‌కి ఉండే క్రేజే వేరు. అందుకే చిరంజీవి నుంచి మెగా ఫ్యామిలీ మొత్తం పిరియాడిక్ మూవీస్‌ను ఎంచుకుంటోంది. భారీ బడ్జెట్‌తో మంచి ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌గా అందిస్తున్నారు.

ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసిన అనీల్‌ రావిపూడి

ఐదు సినిమాలు చేసి వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుని స్టార్‌ డైరెక్టర్‌గా మారిన అనీల్‌ రావిపూడి. ఇప్పుడు నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నిర్మిస్తోన్న చిత్రం

బన్నీ చెప్పాడు.. ప్రామిస్.. ఇక తప్పకుండా చేస్తా!

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో 'పుష్ప' అనే పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా

రాజేంద్రప్రసాద్ కామెడీ హీరో ఎలా

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. అనతి కాలంలోన

మంచి సినిమా.. అన్యాయం అయిపోతోంది

చిన్న సినిమాను పెద్ద సినిమా తొక్కేస్తుందంటారు. కానీ ఒక్కోసారి చిన్న సినిమాకు మరో చిన్న సినిమానే పోటీగా కూర్చుంటుంది. గంపగుత్తగా ఒకేసారి ఓ 10 సినిమాలొస్తే,