ఎన్టీఆర్ వచ్చే నెలలో జాయిన్ అవుతాడట...

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'జై ల‌వ‌కుశ‌'(రిజిష్ట‌ర్ అయిన టైటిల్‌). ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న నివేదాథామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు.

అందులో తండ్రి పాత్ర ఒక‌టి కాగా, ట్విన్ బ్ర‌ద‌ర్స్‌గా కూడా న‌టిస్తున్నాడు. మార్చి 10 నుండి షూట్‌లో ఎన్టీఆర్ పాల్గొంటాడ‌ట‌. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా సి.కె.ముర‌ళీధ‌రన్ సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియ‌న్స్‌ను రంగంలోకి దింపాడు నిర్మాత క‌ళ్యాణ్ రామ్‌. ఐరన్ మ్యాన్‌, లార్డ్ ఆఫ్ రింగ్స్‌, లైఫ్ ఆఫ్ పై, రోబో చిత్రాల‌కు ప్రోస్థెటిక్‌, లెగ‌సీ వ‌ర్క్‌ను అందించిన వాన్స్ హార్ట్ వెల్ ఈ సినిమాకు ప‌నిచేస్తున్నాడు.

More News

'బాహుబలి-2' ఆడియో విడుదల ఎప్పుడంటే....

600 కోట్ల కలెక్షన్స్ తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా 'బాహుబలి ది బిగినింగ్'

బెజవాడ నేపథ్యంలో మరో సినిమా 'రణరంగం'

ఎమ్.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. మంచాల సాయిసుధాకర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'రణరంగం' అనే టైటిల్ని ఖరారు చేశారు.

బాలయ్య సినిమా ముందు అతనితోనే...

నటసింహ నందమూరి బాలకృష్ణ 101వ సినిమాకు సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే బాలకృష్ణ తన 101వ సినిమా చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

నాని హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో

తెలుగు ప్రేక్షకులంతా 'మెట్రో' చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా: గీతా మాధురి

ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజని రామ్ నిర్మించిన సినిమా `మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో మార్చి 3న విడుదల చేస్తున్నారు.