close
Choose your channels

త‌మిళ పాట పాడ‌నున్న యంగ్ టైగ‌ర్‌

Wednesday, February 19, 2020 • తెలుగు Comments

త‌మిళ పాట పాడ‌నున్న యంగ్ టైగ‌ర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్... ప్ర‌స్తుత త‌రంలో అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రు. కేవ‌లం హీరోగా త‌న న‌ట‌న‌తో మెప్పించడ‌మే కాదు, త‌న గాత్రంతో ప్రేక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకున్నారీయ‌న‌. గ‌తంలో య‌మ‌దొంగ‌, ర‌భ‌స చిత్రాల్లో పాట‌లు పాడిన ఎన్టీఆర్ మ‌రోసారి పాట పాడ‌బోతున్నాడ‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఎన్టీఆర్ ఈసారి త‌న సినిమాలో కాకుండా మ‌రో సినిమా కోసం పాట‌ను పాడ‌బోతున్నాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కు ఎన్టీఆర్ పాడ‌బోతున్న పాడ‌బోతున్న హీరో ఎవ‌రో తెలుసా?  కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడైన విజ‌య్ కోస‌మట‌.

విజ‌య్ హీరోగా ఖైదీ ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రీసెంట్‌గా `లెట్ మీ సింగ్ ఎ కుట్టి స్టోరి..` అనే పాట విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందుతుంది. ఈ పాట‌ను త‌మిళంలో హీరో విజ‌య్ పాడ‌టం విశేషం. కాగా.. ఇప్పుడు ఇదే పాట‌ను తెలుగులో ఎన్టీఆర్‌తో పాడించాల‌ని అనుకుంటున్నార‌ట‌. `కొల‌వెరి డీ..` త‌ర‌హాలో సింపుల్ ఇంగ్లీష్, త‌మిళ ప‌దాల‌తో ఈ పాట ఉంటుంది. ఇక తెలుగులో పాట పాడ‌మ‌ని నిర్మాత‌లు ఎన్టీఆర్‌ను కోరార‌ట‌. ఆయ‌న కూడా ఓకే అంటే త్వ‌ర‌లోనే మ‌రో పాట‌ను ఎన్టీఆర్ నోట వినే అవకాశం ఉంటుంది. 

Get Breaking News Alerts From IndiaGlitz