కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ ?

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

హీరోగా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ స్టార్ హీరోగా కొన‌సాగుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఇంత‌కూ ఆయ‌న కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నార‌ని సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కు ఎన్టీఆర్ అడుగు పెడుతున్న కొత్త రంగ‌మేంటో తెలుసా? చిత్ర నిర్మాణ రంగం. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా సినిమాల్లో న‌టించడం, అడ‌పా ద‌డ‌పా క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించిన యంగ్ టైగ‌ర్ ఇక‌పై సినిమాల నిర్మాణ రంగంలో భాగం కావాల‌నుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ని టాక్‌.

సీనియ‌ర్ రామ‌కృష్ణా స్టూడియోస్‌ను స్థాపించి సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఎన్‌బీకే ఫిలింస్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశారు. అలాగే ఎన్టీఆర్ అన్న క‌ల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ను స్థాపించి సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే నంద‌మూరి కుటుంబంలో మూడు బ్యాన‌ర్‌లుండ‌గా ఎన్టీఆర్ మ‌రో బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేస్తాడ‌ని త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయ‌ని టాక్‌. ఇప్ప‌టికే ప్ర‌భాస్ యు.వి.క్రియేష‌న్స్‌, రామ్‌చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌ని, మ‌హేష్ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ను స్టార్ట్ చేశారు. అంద‌రూ సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు వీరి బాట‌లోకి ఎన్టీఆర్ కూడా అడుగు పెడుతున్నాడు. మ‌రి ఈ విష‌యం స‌స్పెన్స్‌కు క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని ఆగాల్సిందే.

More News

‘చలో ట్యాంక్‌బండ్’లో కలకలం..  మావోలు రంగంలోకి దిగారా!?

గత కొన్ని రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్‌ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

అయోధ్య నేపథ్యంలో మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు

భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.

అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

అయోధ్య స్థల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 21న 'జాక్‌పాట్' విడుదల

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్.

అయోధ్యపై సుప్రీం తీర్పు: ఐదెకరాల స్థలం మాకు అక్కర్లేదు!

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి శనివారంతో సుప్రీంకోర్టు ముగింపు పలికిన విషయం విదితమే.