సౌదీ అరేబియాలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు


Send us your feedback to audioarticles@vaarta.com


తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం జీవితాంతం పాటుపడి, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహానుభావుడు, వెండితెరపై ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో అమరమైన నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు సౌదీ అరేబియాలో ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలు "సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య" ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ఈ మహోత్సవానికి ఎన్టీఆర్ గారి తనయుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్బ్యూరో సభ్యులు టి.డి. జనార్ధన్, ప్రముఖ నటి ప్రభ, నందమూరి బెనర్జీ, నందమూరి బిజిలి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందిస్తూ ఘనంగా సత్కరించారు.
టి.డి. జనార్ధన్ మాట్లాడుతూ... "ఎన్టీఆర్ గారు నటుడిగా మాత్రమే కాదు, ప్రజా నాయకుడిగా కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన పాత్రలు తెలుగు తేజాన్ని ప్రపంచానికి చాటాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటూ వజ్రోత్సవాలు జరుపుకోవడం గర్వకారణం."
నందమూరి బెనర్జీ మాట్లాడుతూ... "ఎన్టీఆర్ గారి నటనకు సమానమైనది రెండవది లేదు. ఆయన ప్రతి పాత్రలో జీవించేవారు. ఈ వేడుకలు లో భాగంగా పాల్గొనడం ఎంతో సంతృప్తినిచ్చింది."
నటి ప్రభ తన భావాలను పంచుకుంటూ... "ఎన్టీఆర్ గారితో నటించడం నా జీవితంలోని అద్భుత అనుభవం. ఆయనపై చూపిన అభిమానానికి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆయనపై రచించిన ‘తారకరామం’ పుస్తకం ప్రశంసనీయం."
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ... "మా కుటుంబంపై మీ అభిమానానికి మేం కృతజ్ఞులం. మా నాన్నగారి సినీ సేవలను ప్రపంచవ్యాప్తంగా గుర్తించి ఇలా ఘనంగా వేడుకలు నిర్వహించడాన్ని చూసి గర్వపడుతున్నాం."
ఈ వేడుకలు సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు కోనేరు ఉమా మహేశ్వరరావు నాయకత్వంలో, ఈవెంట్ చైర్మన్ కందిబేడల వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు నాగ శేఖర్ చందగాని, శర్మ చివుకుల, కె.వి.ఎన్. రాజు, దిలీప్ నాట్యం, రోహిత్ నంద, కిషోర్ అద్దంకి, సలీంషేఖ్, హరి కిషన్, ఎన్.వి.బి.కె. కిషోర్, మాజీద్, పాపారావు జుజ్జవరపు, శివ సిరిగిన, శ్రీనివాస్ గుబ్బాల, మనోహర్ ప్రసాద్, విజయ్ కుమార్ సుంకవల్లి, అనిత చెందగాని, రాజ్యలక్ష్మి, బ్రమర, శారద, కాశ్మీరా తదితరుల సహకారంతో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమాన్ని NRI వింగ్ గ్లోబల్ నెట్వర్క్ వైస్ ఛైర్మన్ అశ్విన్ అట్లూరి పర్యవేక్షించారు. వేడుకల సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments