RRRలో ఎన్టీఆర్‌ సరసన నటించేది ఈ బ్యూటీనే..

  • IndiaGlitz, [Wednesday,November 20 2019]

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి చిన్నపాటి అప్డేట్ వచ్చినా ఇటు మెగాభిమానులు.. అటు ఎన్టీఆర్ అభిమానులు.. జక్కన్న వీరాభిమానులకు పండుగే మరి. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చి చాలా రోజులైంది. అయితే పుకార్లు మాత్రం కోకొల్లలుగా వచ్చాయి.

ఇప్పటికే ప్రకటించిన విధంగా చిత్రబృందం బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ జోడీగా హాలీవుడ్ నుంచి ఒక అమ్మాయిని తీసుకుంటే, కొన్ని కారణాల వలన ఆమె తప్పుకుంది. ఆ పాత్ర కోసం ఎవరైతే సూట్ అవుతారని ఇన్ని రోజులు హీరోయిన్ వేట సాగించిన రాజమౌళి ఎట్టకేలకు పట్టేశాడు!. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుందని ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఫొటోతో సహా రిలీజ్ చేసిన చిత్రబృందం ఓలివియా మోరిస్‌కు వెల్‌కమ్ పలికారు. ‘జెన్నిఫర్’ అనే ప్రధానమైన పాత్రను ఓలివీయా చేస్తున్నందకు చాలా సంతోషంగా వుందని.. మీరు షూటింగులో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు చిత్రబృందం ఓ ట్వీట్ చేసింది. సో .. మొత్తానికి చూస్తే ఆలస్యమైనా చివరికి బ్రిటీష్ బ్యూటీనే రాజమౌళి పట్టేశారన్న మాట. మరి ఈ హీరోయిన్ మధ్యలో తప్పుకోకుండా ఉంటుందో లేకుంటే మధ్యలోనే టాటా చెప్పేసి వెళ్లిపోతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

'త‌లైవి' లో యంగ్ టైగ‌ర్  ఎన్టీఆర్‌?

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `త‌లైవి`. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' గా ప్రభుదేవా!

పోకిరి చిత్రాన్ని హిందీలో 'వాంటెడ్' పేరుతో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కొట్టిన డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హీరోగా

'జార్జ్ రెడ్డి' కథ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది - నిర్మాతలు అప్పిరెడ్డి,దామోదర్ రెడ్డి, సంజయ్ రెడ్డి

సందీప్ మాధవ్  (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జిరెడ్డి’’.. విడుదలకు ముందే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జిరెడ్డి’’

‘కమ్మరాజ్యంలో..’ ట్రైలర్-2: సేమ్ టూ సేమ్ దింపేశాడుగా!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

చిరంజీవి 152వ చిత్రానికి సంగీత దర్శకుడు అతనే ?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం  ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కానున్నాయి. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.