శర్వానంద్ చేతులమీదుగా 'ఓ పిల్లా నీ వల్లా' టీజర్ లాంచ్

  • IndiaGlitz, [Saturday,February 04 2017]

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం 'ఓ పిల్లా నీ వ‌ల్లా'. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా ప్ర‌ధాన‌తారాగ‌ణం. ఇటీవ‌లే టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించిన‌ మోష‌న్ పోస్ట‌ర్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి, ప‌రిశ్ర‌మ నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 'ఓ పిల్లా నీ వ‌ల్లా' పోస్ట‌ర్ ఆస‌క్తి రేకెత్తించింద‌ని ప్ర‌శంసించారంతా. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ని 'శ‌త‌మానం భ‌వ‌తి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో తారాప‌థంలోకి దూసుకొచ్చిన మెస్మ‌రైజింగ్ స్టార్ శ‌ర్వానంద్ ఆవిష్క‌రించారు.
ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ మాట్లాడుతూ - ''టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తెలుగు ప్రేక్ష‌కులు వైవిధ్యాన్ని, కొత్త‌ద‌నాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ద‌ర్శ‌కనిర్మాత కిషోర్‌కి అభినంద‌న‌లు'' అన్నారు.
చిత్ర ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ''ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని ల‌వ్‌, కామెడీ -యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే చిత్ర‌మిది. ఫిబ్ర‌వ‌రిలో ఆడియో,మార్చిలో సినిమాను రిలీజ్ చేస్తాం. పూరి ఆవిష్క‌రించిన పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అలాగే మెస్మ‌రైజింగ్ స్టార్‌ శ‌ర్వానంద్ లాంటి స‌క్సెస్‌ఫుల్ హీరో మా సినిమా టీజ‌ర్‌ని ఆవిష్క‌రించ‌డ‌మే ఓ పెద్ద స‌క్సెస్‌గా భావిస్తున్నాం. శ‌ర్వాకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు'' అన్నారు.
కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చౌరాసియా , సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌.

More News

హలీవుడ్ టెక్నిషియన్ తో ఎన్టీఆర్

జనతాగ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 10న లాంచనంగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

'కాటమరాయుడు' టీజర్ రివ్యూ...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు`.

ఐదు క్లైమాక్స్ ప్రిపేర్ చేసుకున్న దర్శకుడు

దగ్గుబాటి రానా హీరోగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఘాజీ`. 1971లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

రామా రీల్స్ 'షో టైమ్' ఆడియో విడుదల

'రామా రీల్స్' పతాకంపై ఎస్ ఎస్ కాంచి దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం 'షో టైమ్.. ఎస్.ఎస్. కాంచి దర్శకత్వంలో నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం, అడుగడుగునా థ్రిల్లింగ్ గా ఉంటుంది.

మెగా షోకు డేట్ కుదిరింది

దాదాపు తొమ్మిదేళ్ళ తర్వా మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ మాత్రం చిరంజీవికి మెమొరబుల్గా మారింది. ఇప్పుడు చిరంజీవి వరుస సినిమాలతో పాటు టీవీ షో కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసింది.