మార్చి 6న 'ఓ పిట్ట క‌థ'

  • IndiaGlitz, [Saturday,February 15 2020]

అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం 'ఓ పిట్ట కథ'. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా న‌టించారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన టీజర్ కి అద్భుత స్పంద‌నవ‌చ్చింది. ''ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే'' అంటూ సాగే మెలోడీ పాటను

'బుట్టబొమ్మ‌' పూజా హెగ్డే చేతుల‌మీదుగా వేలెంటైన్స్ డే రోజున విడుద‌ల చేయ‌గా ఫీల్ గుడ్సాంగ్ అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌లో ఓ ఆస‌క్తి క‌ర‌ సంగ‌తిని నిర్మాత ఆనంద ప్ర‌సాద్ వెల్ల‌డించారు. ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ-''ఈ పాట‌ను అమ‌లాపురం, కాకినాడ ప‌రిస‌రాల్లో చిత్రీక‌రించాం. పాట చిత్రీక‌ర‌ణ‌లో ఓ త‌మాషా ఉంది. మూవీలో స‌న్నివేశం మూడ్ కి త‌గ్గ‌ట్టుగా అక్కడ లొకేష‌న్ల‌లో విజువ‌ల్స్ ని తెర‌కెక్కించాం. తొలుత‌ విజువ‌ల్స్ షూట్ చేశాకే హైద‌రాబాద్ లో ట్యూన్ క‌ట్టాం. ఇలా ఇంత‌కుముందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంశీ

'లేడీస్టైల‌ర్' కోసం ''ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే '' పాటలో ప్ర‌యోగం చేశారు. విజువ‌ల్స్ షూట్ చేసాక ఇళ‌య‌రాజాతో ఆ బాణీని సిద్ధం చేయించారు వంశీ గారు. ఆ తరహాలోనే మేం చేసిన ప్ర‌యోగం

అంద‌రినీ ఆక‌ట్టుకుంటుందని భావిస్తున్నాం. మార్చి 6న సినిమాని రిలీజ్ చేస్తున్నాం'' అని తెలిపారు.

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ''ఒక విలేజ్‌లో జరిగే క‌థ‌ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను క‌లిగిస్తుంది. పతాకసన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొన‌సాగుతుంది. ట్విస్టులు థ్రిల్‌ కలిగిస్తాయి. స్క్రీన్‌ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం'' అని అన్నారు.

నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు..

More News

ఫిబ్రవరి 28న ‘కనులు కనులను దోచాయంటే’

‘కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దాని అర్థం’ – మణిరత్నం దర్శకత్వం వహించిన ‘దొంగ దొంగ’లో హిట్‌ సాంగ్‌ ఇది!

పెళ్లి ప‌నులు మొద‌ల‌య్యాయి... ఆశీర్వాదం కావాలి: నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌, త‌న స్నేహితురాలు షాలినీ కందుకూరిని పెళ్లి చేసుకోనున్నారు. శ‌నివారం వీరి నిశ్చితార్థం జ‌రిగింది.

గోవాలో ఇకపై షూటింగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా!

సినీ ప్రేమికులు షూటింగ్స్ చేయ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే తీర ప్రాంతాల్లో గోవా ముందు వ‌రుస‌లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

'అమ్మ‌దీవెన‌` ట్రైల‌ర్ లాంచ్ చేసిన సీనియ‌ర్ హీరోయిన్ జీవిత రాజ‌శేఖ‌ర్

ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎత్తరి మార‌య్య‌, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి  గుర‌వ‌య్యలు కలసి శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో

చిరు విషయంలో జగన్ మాస్టర్ ప్లాన్ నిజమే..!

జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ బ్రేక్‌లు వేయడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారని www.indiaglitz.com ఇదివరకే ‘వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్..