నిహారిక ఒక మనసు ఆడియో వేడుకకు అతిధులు వీళ్లే...

  • IndiaGlitz, [Tuesday,April 19 2016]

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు హీరోలు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. ఫ‌స్ట్ టైమ్ మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుండ‌డం విశేషం. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక ఒక మ‌న‌సు చిత్రం ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది.
ఈ చిత్రంలో నాగ శౌర్య స‌ర‌స‌న నిహారిక‌ న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని రామ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుర శ్రీథ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సునీల్ కాశ్య‌ప్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఒక మ‌న‌సు ఆడియో వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిధులుగా హాజ‌రు కానున్నారు. వీరితో పాటు నాగ‌బాబు, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఈ వేడుక‌లో పాల్గొంటారు. మ‌రి... బుల్లితెర‌పై బాగా పాపుల‌ర్ అయిన నిహారికా వెండితెర‌పై ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

More News

సరైనోడుకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు

రవితేజతో శ్రీవాస్

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాశిఖన్నా హీరోయిన్ గా డివివి దానయ్య నిర్మాత ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

నయనతార మరో హర్రర్ క్రైమ్...

గతేడాది మయూరి చిత్రంలో టైటిల్ రోల్ పోషించి భయపెట్టిన నయనతార ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉంది. వరుస సినిమాల అవకాశాలను దక్కించుకుంటున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో హర్రర్ క్రైమ్ చిత్రంలో నటించబోతుందట.

జెడి చక్రవర్తి పెళ్లి

శివలో జెడిగా తనదైన మార్కు నటనను ప్రధర్శించి తర్వాత హీరోగా గులాబి,

నితిన్ కు మహేష్ కు అడ్డే...

నితిన్,సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...'.త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.