ఆగస్ట్ 22న 'ఒకటే లైఫ్'

  • IndiaGlitz, [Thursday,July 26 2018]

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం 'ఒకటే లైఫ్' .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలొ కన్పించనున్నారు. త్వరలొ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ.. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్ గా నిలుస్తుంది. ఆగస్ట్ 22న సినిమాను విడుదల చెస్తామన్నారు.

దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. టెక్నాలజీ పేరుతో పరుగులెడుతొన్న నేటి తరం హ్యూమన్ రిలెషన్స్ కు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రమిది. సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు.‌ అమ్రీష్ అందించిన పాటలకు ఆదరణ బాగుంది. ఆర్. ఆర్. కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు

జితన్ రమేష్, శృతియుగల్, సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి ,శ్యామ్ ,దిశ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్ , కూర్పు: నందమూరి హరి, ఆర్ట్: విజయ్ కృష్ణ , పబ్లిసిటీ : సాయి సతీష్, కెమెరా: వై.గిరి, రచన: సతీష్ బండోజీ , దర్శకత్వం : ఎం.వెంకట్, నిర్మాత : నారాయణ్ రామ్

More News

చైతూ చేతుల మీదుగా బ్రాండ్ బాబు ట్రైల‌ర్ విడుద‌ల‌..

హీరో అక్కినేని నాగ‌చైత‌న్య బ్రాండ్ బాబు ట్రైల‌ర్ విడుద‌ల చేసారు. సుమంత్ శైలేంద్ర ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. తెలుగ‌మ్మాయి ఇషా రెబ్బా ఇందులో హీరోయిన్.

సెన్సార్ పూర్తి చేసుకున్న'చిలసౌ'.. ఆగస్టు 3 న విడుదల

సుశాంత్,రుహాణి శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'చిలసౌ'.. నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది..

'నన్నుదోచుకుందువ‌టే' షూటింగ్ పూర్తి.... సెప్టెంబ‌ర్ 13న గ్రాండ్ రిలీజ్

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే..

ఆయుష్మాన్ భవతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కన్నడ బ్యూటీ రన్యా రావ్

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా

సూర్య సినిమా వాయిదా?

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.