కొడుకు కావాలని యువతితో వృద్ధుడి పాడు పని!

  • IndiaGlitz, [Thursday,February 20 2020]

లేటు కుమారుడ్ని కనాలనుకున్నాడు.. కానీ సొంత భార్యతో అది వర్కవుట్ కాలేదు.. ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉండటంతో ఉన్న ఆస్తిని అనుభవించడానికి కుమారుడు కావాలని విశ్వప్రయత్నాలు చేశాడు.. అయితే అనుకున్న రీతిలోనే ముందుకెళ్లి ఉంటే అన్నీ సజావుగా జరిగేవేమో.. కానీ దురాశ పుట్టడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది.. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్ట పరిధిలోని ఆనంద్ నగర్‌లో చోటుచేసుకుంది.

అసలేం జరిగింది!?
పూర్తి వివరాల్లోకెళితే.. స్వరూపరాజ్ అనే వ్యక్తికి 64 ఏళ్లు.. ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ కొడుకు కావాలనే కోరిక అతనిలో బలంగా నాటుకుపోయింది. దీంతో తన మిత్రుడు నూర్‌కు విషయం చెప్పడంతో ఆయనో చెత్త ప్లాన్ ఇచ్చాడు. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొడుకును కనవచ్చని.. ఇందుకు ఒక అవసరం ఉంటుందని చెప్పాడు. దీంతో ఇద్దరూ వెతికి వెతికి మరీ ఓ 23 ఏళ్ల యువతి ద్వారా ఈ గర్భదారణ జరగాలని రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాదు.. కాన్పు అయ్యేంతవరకూ నెలకు రూ.10 వేలు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఆ యువతి కోరడంతా దానికి కూడా అంగీకరించాడు.

ఇక్కడే పాడు బుద్ధి చూపించాడు!
అయితే ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని పక్కనబెట్టి తనతో సహజసిద్ధంగా పిల్లవాడ్ని కనాలని ఆ యువతితో వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆమె ససేమీరా అనడంతో వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఎవర్ని ఆశ్రయించాలో ఆమెకు తెలియక చివరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ వృద్ధ కామాంధుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

బన్నీ కోసం ముంబై టీమ్

అల్లు అర్జున్ బిరుదు స్టైలిష్ స్టార్.. ప్రతి సినిమా లుక్ పరంగా బన్నీ చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు.

ఈ షూటింగ్ స్పాట్ యమా డేంజర్!?

ఈవీపీ స్టూడియో చెన్నైలో బాగా ఫేమస్.. కోలీవుడ్‌కు సంబంధించిన పెద్ద పెద్ద సినిమాల షూటింగ్‌లు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయ్.

‘భీష్మ’ వినోదాత్మకంగా సాగుతుంది  - దర్శకుడు వెంకీ కుడుముల

నితిన్‌, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై

బాధిత కుటుంబాల‌కు క‌మ‌ల్ ఆర్థిక సాయం

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.

సైనిక్ బోర్డుకు కోటి విరాళమిచ్చిన తొలి భారతీయుడిగా పవన్!

దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్! మన దేశంలో ఉన్న ప్రజలను కాపాడేందుకు మట్టిలో సైతం కలిసేందుకు సిద్ధమయ్యేవాడు ఒక్క సైనికుడే!