'కుమారి 21 ఎఫ్' తో మరోసారి...

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

'ల‌వ్ చేయ‌డానికి నేను మాత్ర‌మే స‌రిపోనా.. నా బ్యాక్ గ్రౌండ్ మొత్తం కావాలా' అంటూ 'కుమారి 21 ఎఫ్‌'లో సంద‌డి చేసింది హేబా ప‌టేల్‌. రాజ్ త‌రుణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా నిన్న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యూత్‌ని టార్గెట్ చేసుకుని తెర‌కెక్కిన ఈ సినిమా వారిని బాగానే థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తోంది.

ఈ సినిమాతో హేబాకి న‌టిగా మంచి గుర్తింపు రావ‌డ‌మే కాకుండా.. మ‌రో హిట్ కూడా చేరింది. విశేష‌మేమిటంటే.. హేబా ఓ హీరోయిన్‌గా న‌టించిన 'అలా ఎలా' సినిమా కూడా గ‌తేడాది ఇదే న‌వంబ‌ర్‌ నెల‌లో రిలీజై హిట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది. మ‌ళ్లీ ఏడాది త‌రువాత అదే నెల‌లో వ‌చ్చిన‌ 'కుమారి 21 ఎఫ్' కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో హేబాకి న‌వంబ‌ర్ నెల ల‌క్కీ మంత్‌గా నిలిచింది. వ‌చ్చే ఏడాది ఇదే నెల‌లో మ‌రో సినిమాతో వ‌చ్చి.. హేబా హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.

More News

రెజీనాకి ఇదో ఎక్స్ పీరియన్స్

కొత్త జంట,పవర్,పిల్లా నువ్వు లేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్..వంటి విజయాలతో ఆకట్టుకున్న కథానాయిక రెజీనా.

నో స్మోకింగ్.. నో డ్రింకింగ్..

ధూమపానం, మద్య పానం.. ఇలాంటి సన్నివేశాలు కూడా సినిమాలు తెరకెక్కడం అరుదు. అలాంటి అరుదైన సినిమాగా మరో సినిమా చేరనుంది. అదే 'మిరుదన్'.

నెగెటివ్ రోల్ లో కాజల్?

ఇప్పటివరకు పాజిటివ్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాజల్..ఓ తమిళ చిత్రం కోసం నెగెటివ్ టచ్ ఉన్న రోల్ లో కనిపించనుందని సమచారామ్.

మహేష్ ఖాతాలో మరో బాలీవుడ్ బ్యూటీ?

నమ్రతా శిరోద్కర్,సోనాలి బింద్రే,బిపాసా బసు,లీసారే,అమృతా రావ్..ఈ బాలీవుడ్ భామలందరికి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే..

ఆ రోజుతో 'నాన్నకు ప్రేమతో' పూర్తి

'టెంపర్ 'వంటి బంపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.