close
Choose your channels

మీకోసం ఓ సీన్ మాత్ర‌మే

Thursday, April 18, 2019 • తెలుగు Comments

మీకోసం ఓ సీన్ మాత్ర‌మే

దేవ‌దాస్ త‌ర్వాత కింగ్ నాగార్జున సినిమా చేయ‌డానికి స‌మ‌యం తీసుకున్నాడు. మ‌ధ్య‌లో హిందీలో బ్ర‌హ్మాస్త్ర‌లో గెస్ట్ అప్పియ‌రెన్స్ చేశాడు. అయితే గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు నాగ్ ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అవి కూడా త‌న సినిమాల‌కు సీక్వెల్స్ కావ‌డం గ‌మ‌నార్హం. ముందుగా నాగార్జున మ‌న్మ‌థుడు 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. న‌టన నుండి ద‌ర్శ‌క‌త్వం వైపుకు మ‌ళ్లిన రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టం విశేషం. ప్ర‌స్తుతం పోర్చుగ‌ల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

ఈ సినిమాలో నాగార్జున ఎక్స‌ర్‌సైజ్ చేస్తున్న ఫోటోను త‌న ట్విట్ట‌ర్‌లో ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ పోస్ట్ చేశారు. ఫిట్‌నెస్‌లో ఈ మ‌నిషి అంటూ దండం పెట్టేశాడు. కింగ్ ఫ్యాన్స్ ఈ ఒక సీన్ మాత్రం మీ కోసం అంటూ రాహుల్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రంలో నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు స‌మంత అతిథి పాత్ర‌లో న‌టిస్తుంది. 

 

Get Breaking News Alerts From IndiaGlitz