close
Choose your channels

పూరి త‌న‌యుడి పేరిట ఆన్‌లైన్ మోసం

Friday, December 27, 2019 • తెలుగు Comments

పూరి త‌న‌యుడి పేరిట ఆన్‌లైన్ మోసం

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి త‌న‌యుడు ఆకాశ్‌ పూరి బాల‌నటుడిగా అంద‌రికీ ప‌రిచ‌య‌మే. ఇప్పుడు ఆకాశ్‌ హీరో రాణించ‌డానికి గట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆకాశ్ పూరి పేరిట ఓ ప్ర‌బుద్ధుడు ఆన్‌ల‌న్‌లో మోసం చేయ‌డానికి ప్ర‌య‌త్నించి పోలీసుల‌కు చిక్కాడు. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో మోసాలు పెరిగిపోతున్నాయి.

అలాంటి కోవలో ఓ వ్య‌క్తి ఫేస్‌బుక్‌లో ఆకాశ్ పూరి పేరిట న‌కిలీ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. నిజంగానే అత‌ను ఆకాశ్ పూరి అని న‌మ్మి కొంద‌రు అమ్మాయిలు అత‌న్ని ఫాలో కావ‌డం మొద‌లు పెట్టారు. స‌ద‌రు మోస‌గాడు కొంద‌రు యువ‌తుల‌ను మోసం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. చివ‌ర‌కు ఓ బాధితురాలు అది ఫేక్ అకౌంట్ అని గుర్తించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు స‌ద‌రు ఆన్‌లైన్ మోస‌గాడిని అరెస్ట్ చేశారు. ఆ యువ‌కుడి నుండి హార్డ్ డిస్క్‌, పెన్ డ్రైవ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆకాశ్ పూరి ప్ర‌స్తుతం రొమాంటిక్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. హీరోగా ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను చేసిన ఆంధ్రా పోరి, మెహ‌బూబా చిత్రాలు ప్లాప్ అయ్యాయి. మ‌రి రొమాంటిక్‌తో ఆకాశ్ ఎలాంటి స‌క్సెస్‌ను అందుకుంటాడో వేచి చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz