ఆపరేషన్ 'నిజాముద్దీన్'.. మర్కజ్ వెళ్లిన వారి జాబితా రెడీ!

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన నిజాముద్దీన్ మర్కజ్‌ ముస్లింల ప్రార్థనల వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ సదస్సుకు ఎక్కడెక్కడ్నుంచి వచ్చారో..? వీరందరికీ ఎవరు అనుమతిచ్చారో..? అర్థం కాని పరిస్థితి. అయితే.. ఈ వ్యవహారాన్ని మొట్ట మొదట తెలంగాణ ప్రభుత్వమే బయటపెట్టింది.. అంతేకాదు కేంద్రాన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది కూడా గులాబీ సర్కారే. ఈ తరుణంలో మర్కజ్ వెళ్లొచ్చిన వారి లెక్కలు తేల్చాలని ప్రభుత్వం సిద్ధమైంది.

లిస్ట్ రెడీ.. వాట్ నెక్స్ట్!

మొదట ఈ జమాత్‌కు వెళ్లిన వారు వెయ్యి మంది మాత్రమే అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత రాష్ట్రం నుంచే 2200 మంది వెళ్లారని తేలినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి హాజరైనవాళ్ళ వివరాల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 2 వేల మందికి టెస్టులు చేసి వారిని క్వారెంటైన్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి ఢిల్లీ మర్కజ్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లిన వాళ్ళ లిస్ట్ తెలంగాణ ప్రభుత్వం దగ్గర రెడీగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైందని సమాచారం. గత 15 రోజులుగా వాళ్ళు ఎవరితో క్లోజ్‌గా ఉన్నారు..? ఎవరెవర్ని కలిశారు..? అనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిమగ్నమయ్యాయి.

ఎవరెవర్ని కలిశారో..!?

కరోనా కట్టడికిగాను వాళ్లందర్నీ క్వారెంటైన్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒకేరోజు 6 గురు చనిపోవడంతో.. భయాందోళనకు గురై స్వచ్ఛందంగా వచ్చి 700 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇదంతా మంగళవారం జరిగిన తంతు. అయితే..సోమవారం 1300 మందికి పరీక్షలు చేసి వారిని కూడా క్వారెంటైన్‌కు తరలించిన విషయం విదితమే. మరో 200 మందిని గుర్తించి టెస్టులకు పంపేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మర్కజ్ వెళ్లినవాళ్ళ లిస్ట్ కొలిక్కి రావడంతో వాళ్ళ క్లోజ్, క్యాజువల్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌పై అధికారులు, ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది. తబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వాళ్ళు తిరిగిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తుల వివరాల సేకరణకు కమ్యూనిటీ సపోర్టు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణాలో 82 మంది విదేశీ తబ్లీగీలు ఉంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.!. మరి ఫైనల్‌గా ఏం తేలుతుందో..? లిస్ట్ అధికారికంగా ఎప్పుడు బయటికొస్తుందో..? పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందో..? వేచి చూడాల్సిందే.

More News

ఢిల్లీ ‘నిజాముద్దీన్’ వ్యవహారాన్ని బయటపెట్టిందెవరంటే..!?

భారత్‌లో లాక్‌డౌన్ విధించడంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొలిక్కి వస్తుందని భావిస్తున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్‌ వ్యవహారంతో ఉలిక్కిపడింది.

ఢిల్లీకి వెళ్లింది నిజమే కానీ...: ఏపీ డిప్యూటీ సీఎం సవాల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా ఢిల్లీలోని నిజాముద్ధీన్ ప్రాంతంలో జరిగిన మర్కాజ్ సమావేశాలకు వెళ్లారని.. ఆ మరుసటి రోజే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారని మంగళవారం

మ‌హేశ్ వ‌ర్సెస్ విజ‌య్ ..ట్విట్ట‌ర్ వార్‌

సోష‌ల్ మీడియా పెరిగిన త‌ర్వాత హీరోలు అభిమానులకు చేరువ‌య్యారు. అలాగే ఫ్యాన్స్ మ‌ధ్య వార్స్ కూడా ఎక్కువ‌య్యాయి. మా హీరో గొప్ప అంటే కాదు..

ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌ల్లో మ‌హేశ్‌తో న‌టించేదెవ‌రో?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది.

కరోనా నేపథ్యంలో జియో, వొడాఫోన్ కస్టమర్స్‌కు తీపికబురు

కరోనా నేపథ్యంలో ఇండియా మొత్తం లాక్‌డౌన్‌లో ఉండటంతో టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో తమ వినియోగదారులు ఇబ్బంది పడకూడదని సదరు