నాని సినిమా కోసం ఆస్కార్ సంగీత ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Saturday,February 29 2020]

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే త‌న 25వ సినిమా 'వి'ను పూర్తి చేశాడో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న 26వ సినిమాకు రెడీ అయిపోయాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో 'ట‌క్ జ‌గ‌దీష్‌' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండా త‌న 27వ సినిమాను రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో 'శ్యామ్ సింగ రాయ్‌'ని అనౌన్స్ చేశాడు. 'టాక్సీవాలా' త‌ర్వాత రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న చిత్ర‌మిది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్‌తో చిత్ర యూనిట్ సంప్ర‌దింపులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. స్ట్ర‌యిట్ తెలుగు సినిమాకు రెహమాన్ సంగీతం అందించి చాలా కాల‌మే అవుతుంది. మ‌రిప్పుడు ఏమంటాడో చూడాలి.

రాహుల్ సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని పూర్వ‌జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ‌గా చూపించ‌బోతున్నాడ‌ట‌. ఇందులో రెండు ప్రేమ‌క‌థ‌లుంటాయ‌ట‌. అందులో ఒక‌టి హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగితే.. మ‌రో ప్రేమ‌క‌థ కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంద‌ట‌. ఈ రెండు ప్రేమ‌క‌థ‌ల‌కు పున‌ర్జ‌న్మ‌ల లింక్ ఉంటుంద‌ని స‌మాచారం. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

More News

మ‌రో సినిమాను ట్రాక్‌లో పెడుతున్న ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు కొత్త సినిమాల‌కు ఓకే చెబుతున్నాడు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ష‌న్‌లో ర‌వితేజ సినిమా చేయబోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

విక్ర‌మ్ 'కోబ్రా' ఫ‌స్ట్ లుక్‌... 7 గెట‌ప్స్‌

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమా `కోబ్రా`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్`(ఇమైకా నొడిగ‌ల్‌) ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నిరూపిస్తే రాజీనామా చేస్తా..: రోజా సవాల్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ కార్యకర్తలు, జిల్లా ప్రజలు అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.

కొత్త కాన్సెప్ట్‌తో చేసిన హిట్‌ను ఆద‌రించిన అంద‌రికీ థాంక్స్‌: నిర్మాత నాని

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందిర చిత్రం `హిట్‌`.

చిరు ఇంటిని ముట్టడించట్లేదు.. : జేఏసీ క్లారిటీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును.. మూడు రాజధానులను నిరసిస్తూ 70 రోజులుగా రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.