Download App

ప్ర‌భాస్ కోసం ఆస్కార్ విన్న‌ర్‌

ప్రస్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌.. యువ ద‌ర్శ‌కుడు సుజిత్ రూపొందిస్తున్న ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోంది.ఇదిలా ఉంటే.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయ‌నున్న‌ విషయం తెలిసిందే. ప్రభాస్‌ కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించ‌నుంది.

ఈ నెల‌లోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొంద‌నుంది. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన‌ మరిన్ని విషయాలను అధికారికంగా వెల్ల‌డిస్తారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కి తేవాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌రి రెహ‌మాన్ ఏమంటారో చూడాలి.