close
Choose your channels

ఆర్జీవీకి ఉస్మానియా జేఏసీ నేత వార్నింగ్..

Saturday, July 25, 2020 • తెలుగు Comments

ఆర్జీవీకి ఉస్మానియా జేఏసీ నేత వార్నింగ్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసు వద్దకు వెళ్లిన విషయమై ఉస్మానియా జేఏసీ నేత సంపత్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గిరిజన గ్రామంలో 70 ఏళ్లపాటు తాగునీరు లేదని.. అలాంటి గ్రామానికి బోరు వేయించినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తామంతా గుండెల్లో పెట్టుకున్నామన్నారు. రాజకీయంగా ఆయనను ఎంతైనా విమర్శించుకోవాలని.. కానీ పిచ్చి పిచ్చి సినిమాలు తీసి పర్సనల్‌గా కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకోబోమని.. రామ్ గోపాల్ వర్మను సంపత్ హెచ్చరించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘తమ్ముడు రామ్ గోపాల్ వర్మ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కేవలం మేము నీతో మాట్లాడటానికి వచ్చాం. అన్ని ఛానళ్లలో కూర్చొని చిటికెలు వేశావుగా అందుకే నువ్వెంత పోటు మగాడివోనని వచ్చాం.. కేవలం మాట్లాడటానికే వచ్చాం. పరుగెత్తి ఫోర్త్ ఫ్లోర్‌లో దాక్కుంటావా? బాత్రూంలో దాక్కుంటావా? రావొద్దంటే మేమే రాకపోయే వాళ్లం కదా.. తస్మాత్ జాగ్రత్త.. మేము ఉస్మానియా జేఏసీగా.. జనసేన లీడర్లుగా హెచ్చరిస్తున్నాం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’’ అని సంపత్ నాయక్ హెచ్చరించారు.

Get Breaking News Alerts From IndiaGlitz