సోము వీర్రాజు అసలు హిందువేనా?: ఓవీ రమణ ఫైర్

  • IndiaGlitz, [Tuesday,September 22 2020]

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజుపై మాజీ టీటీడీ పాలకమండలి సభ్యుడు ఓవి రమణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తిరుపతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఓవీ రమణ మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు ఆలయ పరిరక్షణ పేరుతో చేసే కార్యక్రమాల్లో ఫోటోషూట్ తప్ప ఇంకేమి కనిపించదన్నారు. డిక్లరేషన్ విషయంలో అన్ని పార్టీలు మాట్లాడే భాష, చెప్పే విధానం బాగా లేదని విమర్శించారు. నిమిషానికి వందలాది మంది వెళ్లే పరిస్థితిలో మతం అడగటం తిరుమలలో సాధ్యం కాదన్నారు.

అన్యమతస్థులు కూడా తిరుమలకు రావొచ్చన్నారు. డిక్లరేషన్ తప్పనిసరి కాదని ఓవీ రమణ స్పష్టం చేశారు. ముస్లింలు సమర్పించిన నగలు ఇప్పటికి శ్రీవారి ఆలయంలో పూజల్లో వాడుతున్నారన్నారు. ముస్లింలు కాశీకి సైతం వెళ్తున్నారన్నారు. వేంకటేశ్వర స్వామి.. కొడాలి నానికి బావమరిది అవుతారా అని సోమూ వీర్రాజు మాట్లాడం తగదన్నారు. ఇలా మాట్లాడే వీర్రాజు అసలు హిందువేనా? అని ప్రశ్నించారని సోము వీర్రాజు పేర్కొన్నారు. హిందూమతంపై అక్కర ఉంటే శ్రీనివాసమంగాపురం ఆలయాన్ని పురావస్తు శాఖ నుంచి టీటీడీకి ఇప్పించాలన్నారు. వేంకటేశ్వర స్వామితో రాజకీయ లబ్దికి యత్నిస్తే నాశనం అయిపోతారని పేర్కొన్నారు. అయోధ్యలో మొదటి ఆహ్వానం యోగి ఆదిత్యనాథ్ ముస్లింకు ఇస్తారని తెలిపారు. తిరుమలను మాత్రం ముస్లింలకు దూరం చేస్తారా? అని ఓవీ రమణ ప్రశ్నించారు.

More News

అమ్మా.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా?

ఇవాళ నామినేషన్స్ పర్వం నడిచింది. చూస్తున్నంత సేపు.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా? అనిపించింది.

ఆరు పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం..

2021-22 సంవత్సరానికి గాను ఆరు రబీ పంటలకు కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అలనాటి ప్రముఖ నటి సీత మృతి

అలనాటి ప్రముఖ నటి, నటుడు నాగభూషణం సతీమణి సీత(87) నేడు కన్నుమూశారు.

దేశంలోనే తొలిసారిగా సరికొత్త యాప్‌ను రూపొందించిన ఏపీ పోలీస్ శాఖ ..

దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా

ఆసక్తికర అంశాలతో ‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల..

అనుష్క ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రంలో మాధవన్ మరో కీలక పాత్రను పోషించారు.