ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,September 12 2020]

ఇటీవల ఆగిపోయిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్ రేసులో ముందుండంతో ప్రపంచ దృష్టి మొత్తం ఈ వ్యాక్సిన్ పైనే ఉంది. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఒకింత నిరాశకు గురైంది. తాజాగా మళ్లీ షురూ అయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా ఈ టీకాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ టీకాను వేయించుకున్న వలంటీరులో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలు నిలిచిపోయాయి. తాజాగా బ్రిటీష్ రెగ్యులేటర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో బ్రిటన్‌లో తిరిగి వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభించినట్టు ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటనలో తెలిపింది.

ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ఫేజ్ 3 ట్రయల్స్ బుధవారం అర్థంతరంగా ఆగిపోయాయి. క్లినికల్ పరీక్షలో పాల్గొన్న యూకేకు చెందిన వలంటీర్‌ విషయంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే ఆ వ్యక్తికి ఏం జరిగిందనేది స్పష్టంగా తెలియదు కానీ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం మాత్రం ఏర్పడింది. అయితే ఏదైనా వ్యాక్సిన్ కానీ ఔషధం కానీ క్లినికల్ ట్రయల్స్‌లో ఇలాంటి అవరోధాలు ఎదురవడం సాధారణమేనని నిపుణులు తెలిపారు.

More News

అట్లీ డైరెక్ష‌న్‌లో బాద్షా..ల‌క్కీ హీరోయిన్‌తో జోడి..!

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ ఖాన్ త‌య్రంలో ఒక‌రైన షారూక్‌ఖాన్‌.. త్వ‌ర‌లోనే ఓ సౌతిండియ‌న్ డైరెక్ట‌ర్‌తో మూవీ చేయ‌బోతున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో నా ఫీలింగ్ ఏంటంటే..: శ్రియా

మార్చిలో లాక్డౌన్ కావడానికి ముందే, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రాబోయే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కొంతమేర షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే.

కంగనాకు కౌంటరిచ్చిన ప్రకాశ్‌రాజ్‌..!

సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్‌ మాఫియా సంబంధాలున్నాయని ఆధారాలు దొరకడంతో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో రంగంలోకి దిగింది.

నూతన్ నాయుడిపై మరో రెండు కేసులు..

సినీ నిర్మాత, బిగ్‌ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

డ్రగ్స్ కేసులో రియా సంచలనం.. టాలీవుడ్‌ సహా 3 ఇండస్ట్రీల్లో షేక్..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పరోక్షంగా మూడు ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది.