నిలిచిపోయిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు..

  • IndiaGlitz, [Wednesday,September 09 2020]

ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ఫేజ్ 3 ట్రయల్స్ అర్థంతరంగా ఆగిపోయాయి. అయితే ఈ నిలిపివేత తాత్కాలికమే అయినా ప్రపంచమంతా ఆక్స్‌ఫర్డ్ అందించనున్న ఈ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలింగా నిలిచిపోవడం నిరాశాజనకంగా మారింది. బ్రిటన్‌కు చెందిన ఓ వలంటీర్ పరిస్థితి వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం విషమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేతపై యూకే ఆరోగ్య కార్యదర్శి స్పందించారు. క్లినికల్ పరీక్షలో పాల్గొన్న యూకేకు చెందిన వలంటీర్‌ విషయంలో తీవ్రమైన ప్రతికూలత వ్యక్తమైంది. అయితే ఆ వ్యక్తికి ఏం జరిగిందనేది స్పష్టంగా తెలియదు కానీ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం మాత్రం ఏర్పడింది. అన్ని ప్రతికూలతలనూ అధిగమించి 2021 ప్రారంభంలో టీకా తయారు చేయవచ్చని ఆశిస్తున్నట్టు యూకే ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. అయితే ఏదైనా వ్యాక్సిన్ కానీ ఔషధం కానీ క్లినికల్ ట్రయల్స్‌లో ఇలాంటి అవరోధాలు ఎదురవడం సాధారణమేనని తెలుస్తోంది.

వ్యాక్సిన్ ప్రయోగాల నిలిపివేత విషయాన్ని ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్న ఈ సమయంలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని.. వ్యాక్సిన భద్రత విషయమై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం తలెత్తిన సమీక్షపై వీలైనంత త్వరగా సమీక్ష నిర్వహించి వ్యాక్సిన్ ప్రయోగాలను తిరిగి ప్రారంభిస్తామని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. అయితే వలంటీర్‌కు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తిందనేది మాత్రం ఆస్ట్రాజెనెకా వెల్లడించలేదు. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డెబోరా పుల్లర్ అనే ప్రముఖ పరిశోధకుడు.. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యలు కాకుండా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

More News

కీసర తహసీల్దార్‌ను మించిన అవినీతి తిమింగళం దొరికింది..

25 రోజుల తేడాతోనే రెండు భారీ అవినీతి తిమింగళాలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి.

క్లారిటీ లేని టాస్క్‌లతో బోర్ కొట్టించిన బిగ్‌బాస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌తో షో స్టార్ట్ అవడంతో... ఇంకేముంది ఇవాళ బిగ్‌బాస్ ఫుల్లు ఎంటర్‌టైనింగ్‌‌గా ఉండొచ్చు అనిపించింది.

అఖిల్ అక్కినేని - సురేందర్ రెడ్డి - అనిల్ సుంకరల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్

యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.

‘మౌనరాగం’ ఫేమ్ శ్రావణి ఉసురు తీసిన టిక్‌టాక్...

‘మౌనరాగం’ ఫేమ్ శ్రావణి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. టిక్‌టాక్ ఆమె జీవితాన్ని బలి తీసుకుంది.

డైరెక్టర్‌కి ఖరీదైన కారుని గిఫ్ట్‌ ఇచ్చిన నితిన్‌..!

ఈ మధ్య కాలంలో హీరోలు వారికి నచ్చిన వారికి అంటే దర్శకులకు, టెక్నీషియన్స్‌కు తమకెంతో ఇష్టమైన శ్రేయోభిలాషులకు ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు.