సమస్యల్లో 'ఆక్సిజన్'....?

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అయితే ఇప్పుడు సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంద‌ర్భంలో హీరో గోపీచంద్‌, ద‌ర్శ‌కుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ మ‌ధ్య విబేదాలు తలెత్తాయ‌ట‌.

షూటింగ్‌లో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌తో సినిమా ఇప్పుడు హోల్డ్ అయ్యింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా గోపీచంద్‌, బి.గోపాల్ సినిమా ఆర్ధిక స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆగిపోయి మళ్లీ విడుద‌ల‌కు రెడీ అవుతున్న స‌మ‌యంలో ఆక్సిజ‌న్ సినిమాకు స‌మ‌స్య రావ‌డం ఇబ్బందే మ‌రి. 'ఆక్సిజ‌న్' స‌మ‌స్య ఏ కొలిక్కి వ‌స్తుందో చూడాలి. గోపీచంద్ ఇప్పుడు సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు.

More News

బోయపాటి శ్రీను చేతుల మీదుగా 'లెజెండ్' 1000 రోజుల పోస్టర్ విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం `లెజెండ్` ఇప్పుడు విజయవంతంగా 950 రోజులను పూర్తి చేసుకుని 1000 రోజుల దిశగా పయనిస్తుంది.

చిరు సినిమా శాటిలైట్ హ‌క్కులు

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ  చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్‌.

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ‌

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు స్పెష‌ల్ స్టేట‌స్ సాధ‌న కోసం ప్ర‌తి జిల్లాలో పోరాట స‌భ‌ను జ‌న‌సేన నిర్వ‌హిస్తుంద‌ని తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేన సేనాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

బాహుబలి - కాష్మోరా కి ఉన్న తేడా అదే - కాష్మోరా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్

తమిళ హీరో కార్తీ, నయనతార, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నవంబర్ 1 న 'రెమో' ఆడియో రిలీజ్

శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు విడుదల చేస్తున్నారు.