బాలయ్య సర్ స్టార్ కావడానికి కారణం అదే.. ప్రగ్యా జైశ్వాల్ కామెంట్స్!

  • IndiaGlitz, [Friday,July 16 2021]

అందం, అభినయం పుష్కలంగా ఉన్న నటి ప్రగ్యా జైశ్వాల్. కొంత అదృష్టం కూడా ఉండి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది. అయినప్పటికీ తన హార్డ్ వర్క్, గ్లామర్, నటనతో ప్రగ్యా మంచి అవకాశాలు అందుకుంటోంది. 'కంచె' చిత్రంలో తన పెర్ఫామెన్స్ తో ప్రగ్యా జైశ్వాల్ టాలీవుడ్ మొత్తాన్ని ఆకర్షించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: 'ఆధార్' అంటున్న సీనియర్ కమెడియన్.. షూట్ స్టార్ట్!

ప్రస్తుతం ప్రగ్యా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన అఖండ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రగ్యాకు గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ చిత్రంపై కంచె బ్యూటీ బోలెడు ఆశలే పెట్టుకుంది. కరోనా కారణంగా అన్ని చిత్రాల లాగే అఖండ షూటింగ్ కూడా వాయిదా పడింది.

ఇటీవల సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి టాలీవుడ్ చిత్రాల షూటింగ్స్ మొదలవుతున్నాయి. దర్శకుడు బోయపాటి ఇటీవల అఖండ షూటింగ్ ని కూడా ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ప్రగ్యా జైస్వాల్ కూడా జాయిన్ అయింది. తనకెప్పుడూ అఖండ షెడ్యూల్ లో ఎక్కువగా గ్యాప్ వచ్చిన ఫీలింగ్ కలగలేదని అంటోంది ప్రగ్యా.

పరిస్థితులు ఎలా ఉన్నా తాము మాత్రం సెట్స్ లో కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తున్నాం అని ప్రగ్యా తెలిపింది. సెట్స్ లో చిత్ర యూనిట్ సభ్యుల ఆరోగ్యమే మొదట ప్రాధాన్యత అని ప్రగ్యా అంటోంది.

ఇక బాలయ్యపై ప్రగ్యా జైశ్వాల్ ప్రశంసల వర్షం కురిపించింది. బాలయ్య సర్ సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. సెట్స్ లో ప్రతి ఒక్కరితో ఆయన జోకులు వేస్తూ సరదాగా ఉంటారు. సరదాగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఆయన గౌరవం ఇస్తారు. ఇతరుల నుంచి కూడా గౌరవం పొందుతారు. ఈ బెస్ట్ క్వాలిటీనే బాలయ్య సర్ ని స్టార్ గా చేసింది అని ప్రగ్యా అభిప్రాయపడింది.

ఇక ఈ చిత్రంలో తన రోల్ రివీల్ చేసేందుకు ప్రగ్యా ఆసక్తి చూపలేదు. తన పాత్ర స్ట్రాంగ్ గా, యూనిక్ గా ఉంటుందని.. మిగిలిన విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలని ప్రగ్యా అంటోంది.

More News

'ఆధార్' అంటున్న సీనియర్ కమెడియన్.. షూట్ స్టార్ట్!

ప్రముఖ కమెడియన్, తమిళ నటుడు కరుణాస్ కొత్త చిత్రం ప్రారంభం అయింది.  చిత్రానికి విభిన్నంగా 'ఆధార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

పడక గదిలో అంటూ డర్టీ కామెంట్స్.. శృంగార తార మనస్తాపం

హీరోయిన్లు, నటీమణులపై చిత్ర పరిశ్రమలో ఎన్నో రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని రూమర్స్ మాత్రం నటీమణులని అప్సెట్ చేస్తూ ఉంటాయి.

ఆర్.నారాయణమూర్తి కంటతడి.. ఫేక్ న్యూసే కారణం!

విప్లవ భావజాలం, సినిమాలతో సీనియర్ నటుడు ఆర్. నారాయణమూర్తి లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్నారు.

‘సెబాస్టియన్‌ పిసి524’ బర్త్-డే లుక్ కు అద్భుత స్పందన... త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల

కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు.

రాసుకుపూసుకు తిరుగుతున్నారుగా.. ఆ డబ్బంతా ఏమైంది: బాలకృష్ణ

నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.