close
Choose your channels

ఫిబ్రవరి 9న 'పలాస 1978' చిత్రీకరణ ప్రారంభం.

Wednesday, January 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫిబ్రవరి 9న పలాస 1978 చిత్రీకరణ ప్రారంభం.

'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరొగా , నక్షత్ర ను హీరొయిన్ గా పరిచయం చెస్తూ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం 'పలాస 1978'. కరుణ కుమార్ దర్శకత్వం లొ అప్పారావు బెల్లన , అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా 'పలాస 1978' చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఎన్నో చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో వర్క్ చెసిన నేను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నానన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 9న చిత్రీకరణ ప్రారంభిస్తాము.పూర్తిగా ఆంధ్రా ప్రదేశ్ లొనె చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న తొలిచిత్రమిది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్వహరిస్తున్నారు. బెస్ట్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. రియలిస్టిక్ మూవీగా ఈ చిత్రముంటుందని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె, సాహిత్యం: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ సుంకర, నిర్మాతలు: అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్, దర్శకత్వం: కరుణ కుమార్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.