'పంచతంత్రం'లో రామనాథం ఫస్ట్‌లుక్ విడుదల

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. సోమవారం సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా... సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామనాథం పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ సముద్రఖనిగారికి జన్మదిన శుభాకాంక్షలు. గొప్ప నటుడు, వ్యక్తి మా సినిమాలో నటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఓ నటుడిగా ఆయనలో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. మరో పది రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం అని అన్నారు.

ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ పంచేంద్రియాలు చుట్టూ అల్లుకున్న కథతో సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో సముద్రఖనిగారు రామనాథం అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ ఏడాది 'క్రాక్', అంతకు ముందు 'అల వైకుంఠపురములో' సినిమాల్లో ఆయన పవర్‌ఫుల్ విలన్‌గా నటించి మెప్పించారు. మా సినిమాలో సముద్రఖని హీరోగా కనిపిస్తారు. 60 ఏళ్ళ రామనాథం పాత్ర, సినిమా చూస్తున్న ప్రతి యంగ్‌స్టర్‌కి తన తండ్రిని గుర్తు చేసేలా ఉంటుంది అని అన్నారు.

నటీనటులు: ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

More News

కరోనాతో సినీ దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ మృతి

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

వైకల్యాన్ని జయించిన వీరుడు పొట్టి వీరయ్య - రాజశేఖర్, జీవిత దంపతులు

తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అరుదైన నటుడిని కోల్పోయింది. పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు తెలిసిన గట్టు వీరయ్య ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విధితమే.

‘నో మ్యాడ్ ల్యాండ్’కు 3 ఆస్కార్ అవార్డులు.. సినిమా కథ ఏంటంటే..

సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్‌ 93వ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిర్వాహకులు

అల్లు అర్జున్‌పై ప్రశంసల జల్లు కురిపించిన సల్మాన్

స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది.

భారత్‌కు రూ.135 కోట్ల విరాళాన్ని ప్రకటించిన గూగుల్

కరోనా మహమ్మారి దేశంలో ఊహించని విధంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ విస్తరణ వేగం అధికంగా ఉండటంతో రోజుకు లక్షల్లో జనాభా కరోనా బారిన పడుతున్నారు.