Panchathantram:‘పంచతంత్రం’ ... మార్చి 22న ఈటీవీలో స్ట్రీమింగ్

  • IndiaGlitz, [Wednesday,March 15 2023]

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, శ్రీవిద్య ప్రధాన తారాగణంగా నటించిన అంథాలజీ ‘పంచతంత్రం’. ది వీకెండ్ షో స‌మ‌ర్ప‌ణ‌లో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజిన‌ల్స్ బ్యాన‌ర్స్‌పై హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వంలో అఖిలేష్ వ‌ర్ధ‌న్‌, స్రుజ‌న్ ఎర‌బోలు ఈ అంథాల‌జీని నిర్మించారు.

గ‌త ఏడాది ‘పంచతంత్రం’ను డిసెంబ‌ర్ 9న థియేట‌ర్స్‌లో విడుద‌ల చేశారు. అందులో కాన్సెప్ట్స్‌, న‌టీన‌టుల ప్ర‌తిభ‌, టెక్నీషియ‌న్స్ టేకింగ్ ఆడియెన్స్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి. మ‌న శరీరంలోని పంచేద్రియాల‌ను జ్ఞాప‌కాల‌తో అనుసంధానిస్తూ జీవితాన్ని చూడాల‌నే పాయింట్‌తో ఈ అంథాల‌జీని చ‌క్క‌గా తెర‌కెక్కించార‌ని, అలాగే ఐదు క‌థ‌ల హృద‌య స్పంద‌న‌గా పంచ‌తంత్రంను రూపొందించార‌ని క్రిటిక్స్ త‌మ రివ్యూస్ ద్వారా అభినందించారు.

ప్రేమ‌, భ‌యం, చావు, న‌మ్మ‌కం, ల‌క్ష్యాల‌ను సాధించ‌టం అనే అంశాలతో వేర్వేరు ఐదు క‌థ‌ల స‌మాహారంగా ఈ అంథాల‌జీని రూపొందించారు. ఈ అంథాల‌జీ మార్చి 22న ఈటీవీ డిజిటల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

న‌టీనటులు: బ్ర‌హ్మానందం, స‌ముద్ర ఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ విజ‌య్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య శ్రీపాద‌, శ్రీవిద్య‌, వికాస్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ త‌దిత‌రులు

More News

Pawan Kalyan:ఇందుకే నువ్వు దేవుడివి సామి.. వారాహి ఆపి అంబులెన్స్‌కు దారిచ్చిన పవన్, వీడియో వైరల్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈపేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా..

New Secretariat:ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ఓపెనింగ్ : ముహూర్తం ఇదే.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న మేష లగ్నంలో ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు

Alekhya Reddy:తండ్రిలా తోడు, తల్లిలా లాలన.. ఆయనే మా కుటుంబం : బాలయ్యపై తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది.

Janasena :జనసేన పదేళ్ల ప్రస్థానం.. ఆవిర్భావ సభలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేనా, పవన్ ఏం చెప్పబోతున్నారు..?

ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం తర్వాత .. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో శూన్యత మధ్య రాజకీయాల్లోకి ప్రవేశించారు

Katha Venuka Katha:‘కథ వెనుక కథ’.. మార్చి 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోన్న సస్పెన్స్ థ్రిల్ల‌ర్

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్.