Panja Vaishnav Tej :పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రచార చిత్రం విడుదల

  • IndiaGlitz, [Monday,January 02 2023]

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో రూపు దిద్దు కుంటున్న చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడు గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. కథానాయికగా ‘శ్రీ లీల‘ నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎస్. నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు.

ఆంగ్ల సంవత్సరాది శుభ వేళ ఈ చిత్రానికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. 29 ఏప్రిల్, 2023 న చిత్రం విడుదల అన్నది ఈ ప్రచార చిత్రం లో గమనించ వచ్చు. తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ కథానాయకుడు నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న వైనం, ఆసక్తిని రేకెత్తిస్తూ, ఆకట్టుకుంటోంది ఈ విడుదల తేదీ ప్రచార చిత్రం.

తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ విషయాన్ని గతంలో పౌరుషా నికి ప్రతీకగా విడుదల అయిన ప్రచార చిత్రం నిరూపించింది. అంతేకాదు భారీస్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది.

వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక,నిర్మాతలు. ఇప్పటికే చిత్రం చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు

More News

Shaakuntalam:ఫిబ్ర‌వ‌రి 17న ‘శాకుంతలం’ రిలీజ్‌

అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే  ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న

చంద్రబాబు సభలో తొక్కిసలాట .. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం : మన్నవ మోహనకృష్ణ

న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరులో జరిగిన చంద్రన్న కానుక, ఎన్టీఆర్ జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో

Sir: ధనుష్ 'సార్' నుంచి ‘బంజారా‘ గీతం విడుదల

శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ.

Pawan Kalyan : కదనరంగంలోకి వారాహి... అంజన్న ఆశీస్సుల కోసం కొండగట్టుకి పవన్ కల్యాణ్

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

Ramya Raghupathi:నరేష్ అఫైర్స్ అన్నీ విజయ నిర్మలకు తెలుసు.. పవిత్ర అలా దగ్గరైంది : రమ్య రఘుపతి సంచలనం

చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో నరేశ్, పవిత్రా లోకేష్‌ల వ్యవహారం ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే.