ఘనంగా పేపర్ బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్

  • IndiaGlitz, [Wednesday,August 29 2018]

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'.. జయ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం, సౌందర్య రాజన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు.. ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా థియరిటికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వివి వినాయక్ , మెహర్ రమేష్, సుకుమార్, ఎన్ . శంకర్, దశరథ్ , ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ లు ముఖ్య అతిధులుగా వచ్చారు..

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ..ఈ సినిమాలో సంగీతం చేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నాను..ఈ చిత్రం ద్వారా మీడియా మనిషి అయినా సురేష్ ఉపాధ్యాయ గీత రచయిత గా పరిచయమవుతున్నారు.. అడగ్గానే ఈ సినిమాలో పాట పాడిన చంద్రబోస్ గారికి ధన్యవాదాలు... దర్శకులు శంకర్ గారు నా సినీ జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టించిన గురువుగారు ఇక్కడికి వచ్చినందుకు చాల ఆనందంగా ఉంది.. అలాగే ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకి, డైరెక్టర్ కి , సంపత్ నంది గారికి చాల కృతజ్ఞతలు.. అన్నారు..

దర్శకుడు జయ శంకర్ మాట్లాడుతూ.. నా షార్ట్ ఫిలిం చూసి నాకు ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించిన ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి గారికి ధన్యవాదాలు..సంపత్ నంది గారి ఏమైంది ఈ వేళ సినిమా చూసినప్పుడు నాలో ఒక డైలాగ్ నాటుకుపోయింది..అలాంటి ఒక బ్రిలియంట్ డైలాగ్స్ ఈ సినిమాలో చాల ఉన్నాయి.. నాకీ అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి థాంక్యూ సో మచ్.. ఆయనతో నా ట్రావెల్ వన్ ఇయర్ నేను నా జీవితంలో మర్చిపోలేది... గీత ఆర్ట్స్ కి పేపర్ బాయ్ టీం అంతా రుణపడి ఉంటుంది.. మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు అల్లు అరవింద్ గారికి చాల థాంక్స్.. ఈ సినిమా చుసిన తర్వాత సంతోష్ శోభన్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు.. అంత బాగా యాక్ట్ చేసాడు..అన్నారు..

చిత్ర నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమా ట్రైలర్ చూసి ట్వీట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి , అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్.. మొన్నటిదాకా ఈ సినిమా చాల చిన్న సినిమా.. ఎప్పుడైతే గీత ఆర్ట్స్ ఈ సినిమా టేక్ అప్ చేసిందో అప్పడు జనాలకు ఈ సినిమా మరింత చేరువైంది.. అరవింద్ గారికి ఈ సినిమా చూసి నచ్చిందనగానే ఈ సినిమా హిట్ అని తెలిసిపోయింది.. అసలీ సినిమా ఒకటి ఉందని అల్లు అరవింద్ గారికి తెలియడానికి కారణం మెహర్ రమేష్ గారు.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను.. అరవింద్ గారు ఇక్కడికి రావడం మా అదృష్టం.. ఇక్కడికి వచ్చిన మెహర్ గారికి, వినాయక్ గారికి, దశరథ్ గారికి, ఎన్. శంకర్ గారికి , సుకుమార్ గారికి చాల చాల థాంక్స్.

ఈ సినిమా కథ చాల నిజాయితీగా తీసాం.. దర్శకుడు జయశంకర్ ఈ సినిమాని చాల బాగా హ్యాండిల్ చేసాడు.. సంతోష్ శోభన్ చాల బాగా యాక్ట్ చేసాడు. దర్శకుడు శోభన్ గారి అబ్బాయి సంతోష్ భవిష్యత్ చాల బాగా ఉంటుందని ఆశిస్తున్నా.. ఈ సినిమా కి పనిచేసిన అందరు టెక్నిషియన్స్ చాల బాగా చేశారు.

అందరికి చాల థాంక్స్.. ప్రొడ్యూసర్స్ వెంకట్, రాములు, నరసింహ గారు ఈ సినిమా తో అందరికి మంచి ప్రోత్సాహాన్నిచ్చారు.. అలాగే సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మంచి సంగీతం అందించారు.. లిరిక్ రైటర్స్ చాల మంచి లిరిక్స్ ఇచ్చారు.. అన్నారు.

హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ..అందరికి చాల థాంక్స్.. ఈ ఫంక్షన్ కి వచ్చినందుకు.. ముందుగా అల్లు అరవింద గారికి ధన్యవాదాలు.. ఈ సినిమా చూసి మా అందర్నీ సప్పోర్ట్ చేసినందుకు.. గీత ఆర్ట్స్ పనిచేయాలనే కోరిక ఈ విధంగా తీరింది.. ఇక్కడికి వచ్చిన స్టార్ డైరెక్టర్స్ అందరికి చాల థాంక్స్.. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సంపత్ గారికి కృతజ్ఞతలు.

ఈ సినిమా ధరణి పాత్రలో నటించాను.. అది మీ అందరికి బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను.. టీజర్, ట్రైలర్ తర్వాత నాకు మంచి పేరొచ్చింది.. నన్ను ఇంత బాగా చూపించినందుకు సౌందర్ రాజన్ గారికి చాల థాంక్స్..నాకు సపోర్ట్ చేసిన పేపర్ బాయ్ క్యాస్ట్ అండ్ క్రూ కి చాల థాంక్స్.. అన్నారు..

ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. పేపర్ బాయ్ సినిమా లోని కొన్ని సీన్స్ చూసి చాల ఎక్జియిట్ అయ్యాను.. గీత ఆర్ట్స్ ఈ సినిమా ని టేక్ అప్ చేసి సినిమా రేంజ్ ని మరింత పెంచేసింది.. సంపత్ నంది మొదటి సినిమా ఏమైంది ఈ వేళ చూసి చాల బాగా ఎంజాయ్ చేసాను.. ఒక డైరెక్టర్ అయ్యి ఉండి మరో డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం నిజంగా గొప్ప విషయం.. సంతోష్ మంచి ఎమోషనల్ గా నటించాడు.. చాల బాగుంది అతని నటన.. స్టోరీ తెలుసు కాబట్టి ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని చెప్తున్నాను.. అందరు పెద్ద టెక్నీషియన్స్ పని చేసిన ఈ సినిమా చిన్న సినిమాకాదు పెద్ద సినిమా తప్పకుండ హిట్ అవుతుంది.. అన్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమాని చూడాలని నా దగ్గరికి మెహర్ రమేష్ వచ్చారు.. ఆ తర్వాత చూసాక ఈ సినిమా నాకు చాల నచ్చింది.. అందుకే ఈ సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ కి తీసుకున్నాను.. గీత గోవిందం సినిమా హిట్ లో ఉన్న మేము ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుని ఈ సినిమాని టెక్ ఓవర్ చేసాను.. కొన్ని సినిమాలు ఎంత బాగున్నా జనంలోకి వెళ్లకండానే కనుమరుగైపోతాయి.

అలా ఇంత మంచి సినిమా అవకూడదని తీసుకోవడం జరిగింది.. సంపత్ నంది ఓ యంగ్ స్టర్ కి అవకాశం ఇచ్చి ,తాను ప్రొడ్యూసర్ గా నిర్మించి తీసిన ఇంత గొప్ప సినిమా ని రిలీజ్ చేస్తునందుకు మాకు గర్వకారణం గా వుంది..ఇండస్ట్రీ ని నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే ఎవరికీ సప్పోర్ట్ ఇవ్వాలి అని ఈ సినిమాని రిలీజ్ చేసాను.. దర్శకుడు జయశంకర్ లో కూడా మంచి టాలెంట్ వుంది.

ఇక సంతోష్ లో కూడా మంచి ప్రతిభ వుంది.. మంచి భవిష్యత్ వుంది.. రియా చాల అందంగా క్యూట్ గా కనిపించింది సినిమాలో.. పవన్ కళ్యాణ్ పక్కన చేసిన భూమిక గుర్తొచ్చింది ఈ సినిమాలో ఆమెను చూస్తుంటే.. ఈ సినిమాను తప్పకుండా అందరు సప్పోర్ట్ చేయండి.. అన్నారు.

దర్శకుడు మెహర్ రమేష్.. సంపత్ నంది సిన్సియర్ గా తీసిన సినిమా ఇది.. మా అందరికి ఎంతో ఇష్టమైన డైరెక్టర్ శోభన్ గారి కొడుకు సంతోష్ హీరోగా వస్తున్న సినిమా , ఎలా నటించాడు అని చూద్దామని వెళ్లి అల్లు అరవింద్ గారితో ఈ సినిమా చూసాం.. ఆయనకు నచ్చడం మా అదృష్టం.. శోభన్ గారి ఆశీస్సులు సంతోష్ గారికి ఎల్లప్పుడూ ఉంటాయి. గీత గోవిందం తర్వాత గీత ఆర్ట్స్ లో పేపర్ బాయ్ మరో హిట్ కొట్టబోతుంది.. అన్నారు..

సినిమా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన అతిధులకు , ప్రేక్షకులకు చాల థాంక్స్.. అల్లు అరవింద్ గారితో పనిచేయడం నా కల నెరవేరిందని చెప్పాలి.. మా సినిమానిసప్పోర్ట్ చేసిన అల్లు అరవింద్ గారికి చాల థాంక్స్.. మమ్మల్ని నమ్మి , నాతో సినిమా చేసిన సంపత్ నంది గారికి చాల థాంక్స్ ప్రొడ్యూసర్స్ గారికి నా కృతజ్ఞతలు.. డైరెక్టర్ జయశంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. నాకేమాత్రం పేరొచ్చినా దానికి జయశంకర్ గారే కారణం.. అన్నారు..ఘనంగా పేపర్ బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్..!!

More News

నంద‌మూరి హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలిపిన డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌

న‌టుడు, తెలుగుదేశం నేత నంద‌మూరి హ‌రికృష్ణ కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణం నంద‌మూరి అభిమానుల‌ను , టీడీపీ శ్రేణుల‌కు తీర‌ని లోటు.

అభిమానుల‌కు హ‌రికృష్ణ చివ‌రి లేఖ‌...

సెప్టెంబ‌ర్ 2న హ‌రికృష్ణ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా.. త‌న‌కు అభిమానులు, స్నేహితులు ఎవ‌రైనా పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ చేయ‌వద్ద‌ని.

హ‌రికృష్ణ చివ‌రి మాట‌లు...

ఇండ‌స్ట్రీలో నంద‌మూరి హ‌రికృష్ణ తమ్ముడూ! అని ఆప్యాయంగా పిలుచుకునే వ్య‌క్తి నాగార్జున అక్కినేని. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ క‌లిసి మెలిసి ఉండే అనుబంధంతో పిల్ల‌ల మ‌ధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది.

ఒకే ర‌హ‌దారి.. నంద‌మూరి హ‌రికృష్ణ‌ ఫ్యామిలీ

కొన్ని ఘ‌ట‌న‌లు యాదృచ్చికంగా జ‌రిగినా.. అనుకోని లింక్ ఏదో క‌న‌ప‌డుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌యం కాకున్నా..

నంద‌మూరి హ‌రికృష్ణ దుర్మ‌ర‌ణం

న‌టుడు, నిర్మాత, టీడీపీ నేత‌ నంద‌మూరి హ‌రికృష్ణ న‌ల్గొండ జిల్లా అన్నేప‌ర్తిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు.