కమ్మరాజ్యం నుంచి ‘పప్పులాంటి అబ్బాయ్..’ పాటొచ్చేసిందోచ్!

  • IndiaGlitz, [Friday,November 08 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఇలాఎందుకంటే.. ఆయన వివాదాలంటేనే ఇష్టం.. అలానే పెరిగారు కూడా. నిత్యం వివాదాలతో రోజు ప్రారంభించి మళ్లీ పడుకునేటప్పుడు ఏదో ఒక్కటి చేస్తే కానీ కునుకు పట్టదు. అదీ ఆర్జీవీ రోజూవారి దినచర్య. అయితే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. ఇప్పటికే చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు..? ఎవరెవరికి ఏయే పాత్రలు అనే విషయం దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు.. కొద్దిరోజుల క్రితం ‘ఏయ్.. ఏసెయ్ రా నా కొడుకుని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. ‘కేఏ పాల్‌’ కు సంబంధించిన పాటలను ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ విడుదల చేసిన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ‘పప్పులాంటి అబ్బాయ్..’ అంటూ ఆర్జీవీ విడుల చేశాడు. ఇందులో పూర్తిగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ పాటలో స్పష్టంగా ఉంది. అంతేకాకుండా పాటలో టీడీపీ పార్టీ సింబల్ సైకిల్‌ను కూడా ఆర్జీవీ వాడిపారేశాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే పార్టీకి బాధ్యతలు ఎవరు వహించాలి..? రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండనుందో..? ఎవర్ని నాయకుడిగా ఎన్నుకోవాలి..? అనేదానిపై ఈ పాటలో చర్చించినట్లు ఉంది. కాగా.. ఇప్పటి వరకూ సినిమా వ్యవహారంపై స్పందించని తెలుగు తమ్ముళ్లు.. ఈ పాటపై అయినా రియాక్ట్ అవుతారో లేదో వేచి చూడాల్సిందే మరి.

More News

పోలవరంపై ఉదయం షాకింగ్.. సాయంత్రం గుడ్ న్యూస్!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ పోలవరంపై గత కొన్ని రోజులుగా ఇటు కోర్టులు...

అనారోగ్యంపై స్పందించి.. క్లారిటీ ఇచ్చుకున్న యాంకర్ ప్రదీప్

టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన ప్రదీప్.. గత కొన్నిరోజులుగా స్క్రీన్‌పై కనపించకపోవడంతో అసలేం జరిగింది..?

మ‌రో హీరోయిన్‌తో క‌మ‌ల్ రిలేష‌న్‌లో ఉన్నాడా?

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ ఒక‌రు. ఈయ‌న సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆరు ద‌శాబ్దాలు దాటింది.

రోహిత్ శెట్టి కారు ధ‌ర ఎంతో తెలుసా?

బాలీవుడ్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు మెప్పించేలా సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి.

ప్యాన్ ఇండియా సినిమాపై మ‌హేశ్ క‌న్ను

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌.. ఈ హీరో పేరు కేవ‌లం మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు ఉత్త‌రాది రాష్ట్రాల్లోనూ సుప‌రిచిత‌మే.