close
Choose your channels

'అనగనగా ఓ ప్రేమకథ' లోని  "ఒక తొలిప్రేమ" పాటను విడుదల చేసిన పరశురామ్

Tuesday, October 16, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనగనగా ఓ ప్రేమకథ లోని  ఒక తొలిప్రేమ పాటను విడుదల చేసిన పరశురామ్

'అనగనగా ఓ ప్రేమకథ ' ఈ చిత్రానికి సంబంధించిన 'ఒక తొలిప్రేమ' సాంగ్ ను ప్రముఖ దర్శకుడుపరశురామ్ ఈరోజు ఉదయం విడుదల చేశారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయన్నారు. హీరో అశ్విన్ బాగా చదువుకున్నవాడు. వినయ విధేయతలు కలిగినవాడు. చిత్రం టీజర్ ను చూసాను. ఎంతో ప్రామిసింగ్గా ఉంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు.

తమ చిత్రంలోని పాటను దర్శకుడు పరశురామ్ విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ గీతం అరకు, విశాఖపట్నం లలోని పలు లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.

అనగనగా ఓ ప్రేమకథ లోని  ఒక తొలిప్రేమ పాటను విడుదల చేసిన పరశురామ్విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా 'అనగనగా ఓ ప్రేమకథ' పేరుతొ ఈ చిత్రం నిర్మితమవుతోంది. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

అనగనగా ఓ ప్రేమకథ లోని  ఒక తొలిప్రేమ పాటను విడుదల చేసిన పరశురామ్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.