close
Choose your channels

Parichayam Review

Review by IndiaGlitz [ Saturday, July 21, 2018 • తెలుగు ]
Parichayam Review
Banner:
Asin Movie Creations
Cast:
Virat Kondur, Simrat Kaur, Paruchuri Venkateshwarrao, Rajeev Kanakala, Prudvi
Direction:
Lakshmikant Chenna
Production:
Riaz
Music:
Shekar Chandra

కొత్త ద‌ర్శ‌కుల‌కు, త‌మ‌ని తాము ప్రూవ్ చేసుకోవాల‌ని తాపత్ర‌య ప‌డే ద‌ర్శ‌కుల‌కు స‌క్సెస్‌ఫార్ములా ల‌వ్ స్టోరీసే. హైద‌రాబాద్ నవాబ్స్ వంటి కామెడీ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌ఖుడు ల‌క్ష్మీకాంత్ చెన్నా డైరెక్ట్ చేసిన ప్రేమ‌క‌థా చిత్ర‌మే ప‌రిచ‌యం. ప్రేమ‌క‌థల్లో లీడ్ పెయిర్ కీల‌కంగా ఉంటారు. అలాంటి లీడ్ పెయిర్‌గా విరాట్‌, సిమ్ర‌ట్ కౌర్‌ని ప‌రిచ‌యం చేస్తూ ల‌క్ష్మీకాంత్ చెన్నా చేసిన పరిచ‌యం సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థంటే చూద్దాం.. 

క‌థ‌: 

రైల్వే ఉద్యోగులైన సుబ్ర‌మ‌ణ్యం(రాజీవ్ క‌న‌కాల‌), సాంబ‌శివరావు(పృథ్వి) ప‌క్క ప‌క్క ఇళ్లల్లోనే ఉంటారు. ఒకే రోజున ఇద్ద‌రూ తండ్రుల‌వుతారు. సుబ్ర‌మ‌ణ్యం కొడుకు, సాంబ‌శివ‌రావుకు అమ్మాయి పుడుతుంది. సుబ్ర‌మ‌ణ్యం త‌న‌కు కొడుక్కి ఆనంద్‌(విరాట్‌) అని పేరు పెడితే.. సాంబ‌శివ‌రావు త‌న కూతురికి ల‌క్ష్మి(సిమ్ర‌త్ కౌర్‌) అని పేరు పెడ‌తాడు. ఇద్ద‌రూ ఒక‌చోట క‌లిసి పెర‌గ‌డం వ‌ల్ల ఇద్ద‌రి మ‌న‌స్సులో ప్రేమ పుడుతుంది. ఓరోజు ఆనంద్ త‌న ప్రేమ‌ను ల‌క్ష్మికి చెప్పేస్తాడు. అయితే వీరి ప్రేమ వ్య‌వ‌హారం తెలిసిన సాంబ‌శివ‌రావు ఒప్పుకోడు..స‌రిక‌దా.. ఆమెకు మ‌రొక‌రితో పెళ్లి చేయాల‌నుకుంటాడు. ఆనంద్‌ను విడిచి ఉండ‌లేక .. మ‌రొక‌రిని పెళ్లి చేసుకోలేక ల‌క్ష్మి విషం తాగుతుంది. దాని వ‌ల్ల ఆమె మ‌తిస్థిమితం కోల్పోతుంది. రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ ఇంకా పెరిగి పెద్ద‌ద‌వుతుంది. చివ‌ర‌కు త‌న ప్రేమ కోసం ఆనంద్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు?  ఆనంద్‌, ల‌క్ష్మి ఒక‌ట‌వుతారా?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

స‌మీక్ష‌:

తొలిసారి కామెడీ చిత్రాన్ని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ల‌క్ష్మీకాంత్ రెండో ప్ర‌య‌త్నంలో ఓ స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థను తెర‌కెక్కించాల‌నుకున్నాడు. ప్రేమ క‌థ‌లో ప్రేమ‌కు సుఖాంత‌మైన ముగింపైనా.. బాధ‌తో కూడిన ముగింపైనా ఉంటుంది. ప్రేమ‌క‌థ‌ల‌ను క్యారీ చేసే క్ర‌మంలో బ‌ల‌మైన ఎమోష‌న్స్‌.. వాటికి త‌గ్గ స‌న్నివేశాలు.. హీరో హీరోయిన్ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ అన్నీ చ‌క్క‌గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. కెమెరా, సంగీతం ఇక ముఖ్య భూమిక‌ను పోషించాలి. డైరెక్ట‌ర్ ల‌క్ష్మీకాంత్ చెన్నా.. ఆస‌క్తిక‌రంగా లేని స్క్రీన్‌ప్లేను రాసుకున్నాడు. హీరో, హీరోయిన్ చూడ‌టానికి చ‌క్క‌గా ఉన్నారు. వారి మేర చ‌క్క‌గానే న‌టించారు. కానీ స‌న్నివేశాలే ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ కావు. ఉన్న కొన్ని స‌న్నివేశాలను చ‌క్క‌గా చిత్రీక‌రించ‌లేక‌పోయారు. ఇక ఓ పాట మిన‌హా సినిమాలోసంగీతం, నేప‌థ్య సంగీతం ఆకట్టుకునేంత లేదు. న‌రేశ్ రానా సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మెయిన్ ఎసెట్ అయింది. ఇక లొకేష‌న్స్ కూడా బావున్నాయి. సినిమాలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన రాజీవ్ క‌న‌కాల‌, పృథ్వీ, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, సిజ్జులు పాత్రల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. సినిమా న‌త్త‌న‌డ‌క‌న సాగ‌డం.. బ‌ల‌మైన ఎమోష‌న్స్ లేక‌పోవ‌డం.. హీరోయిన్ విషం తాగితే గ‌తాన్ని మ‌రచిపోవ‌డం.. క‌రెంట్ షాక్ త‌ర్వాత ఆమెకు గ‌తం గుర్తుకు రావ‌డం అనే సిల్లీ సీన్స్ ఇవన్నీ డైరెక్ష‌న్‌లోని లోపాల‌ను ఎత్తి చూపేవే.

చివ‌ర‌గా.. న‌త్త‌న‌డ‌క 'ప‌రిచ‌యం'

Parichayam Movie Review in English

Rating: 2 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE