close
Choose your channels

'పరిగెత్తు పరిగెత్తు' మూవీ రివ్యూ!

Monday, August 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పరిగెత్తు పరిగెత్తు మూవీ రివ్యూ!

క్రైమ్ జోనర్ లో తెరకెక్కే థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుంది. ఇలాంటి కథలని ఇష్టపడే ప్రేక్షకులు చిన్న చిత్రమా, పెద్ద చిత్రమా అని ఆలోచించరు. సినిమా బావుంటే తప్పనిసరిగా ఆదరిస్తారు. దర్శకులు, నటీనటులు చేయాల్సిందల్లా ప్రేక్షకులకు థ్రిల్ ని అందించడమే. ఈ జోనర్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పరిగెత్తు పరిగెత్తు'. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

మధ్య తరగతి కుర్రాడు అజయ్ (సూర్య శ్రీనివాస్). బాగా చదువుకుని, వ్యాపారంలో సెటిల్ అయి తల్లిదండ్రులని బాగా చూసుకుంటూ సింపుల్ లైఫ్ లీడ్ చేయాలనేది అతడి కోరిక. ఇంతలో అజయ్ కి రెడ్ క్రాస్ లో పనిచేసే యువతి ప్రియ(అమృత)తో పరిచయం ఏర్పడుతుంది. వీరి పరిచయం ప్రేమకు దారితీస్తుంది. తన బిజినెస్ కోసం అజయ్ ఓ వ్యక్తి వద్ద రూ 10 లక్షలు అప్పు చేసి ఉంటాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. దీనితో అతడు అజయ్ ప్రియురాలు ప్రియని కిడ్నాప్ చేస్తాడు.

తన అప్పు చెల్లించి.. ప్రియని విడిపించుకు వెళ్లాలని అజయ్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ క్రమంలో అజయ్ ని అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అజయ్ అప్పు చెల్లించి ప్రియురాలిని విడిపించుకోగలిగాడా ? అజయ్ కి ఎదురైన అడ్డంకులు ఏంటి ? అనే అంశాలు తెలుసుకోవడమే ఈ చిత్ర కథ.

విశ్లేషణ:

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో దర్శకుడు..నిరుద్యోగ యువత మాదక ద్రవ్యాలకు ఎలా బానిసలు అవుతున్నారు అనే అంశాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు బలమైన స్క్రీన్ ప్లే అవసరం. అందులో ఆ విషయంలో దర్శకుడు రామకృష్ణ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

ఫ్యామిలీ సమస్యలు, అప్పు, విలన్ చేతిలో బందీ ఐన ప్రియురాలి.. ఇలా హీరో కథని గ్రిప్పింగ్ గా నడిపిస్తూనే థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేశారు. రెండు గంటలపాటు ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ఈ  క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు.

వైజాగ్ నేపథ్యంగా గంజాయి అక్రమ రవాణా ఎలా జరుగుతోంది.. యువత జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి లాంటి వ్యవస్థ లోపాల్ని దర్శకుడు చక్కగా చూపించారు. ఈ అంశాలన్నింటితో దర్శకుడు ప్రేక్షకులని అందించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పెద్దగా కమర్షియల్ అంశాలకు ఈ కథలో చోటు లేనప్పటికీ.. ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన స్పెషల్ సాంగ్ కూడా కట్టుకుంటుంది.

నటీనటులు :

ముందుగా చెప్పుకున్నట్లుగా హీరో పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది. లీడ్ రోల్ లో సూర్య శ్రీనివాస్ నటన బావుంది. లవ్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎమోషన్స్ ని సూర్య శ్రీనివాస్ పలికించాడు. హీరోయిన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఎంగేజింగ్ గా అనిపించే కథ, స్క్రీన్ ప్లే ఉండడంతో నటీనటులందరి నటన ఆకట్టుకుంటుంది.

విలన్ గా నటించిన వారు, చివర్లో వచ్చే రిటైర్డ్ ఆర్మీ అధికారి పాత్ర మంచి అటెన్షన్ తీసుకుంటాయి. స్టార్ నటీనటులు లేనప్పటికీ బలమైన కథ.. ఆ కథని ఎలివేట్ చేసే నటీనటులు ఉంటే సరిపోతుందని ఈ చిత్రం నిరూపించే విధంగా ఉంది.

సాంకేతికంగా :

హీరో చుట్టూ ఓ కథ.. దానికి క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలు జోడించి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రజెంట్ చేయడం లో దర్శకుడి పనితనాన్ని అభినందించాలి. ప్రేక్షకులు 2 గంటల పాటు బోర్ ఫీల్ అవ్వకుండా ఉండేందుకు దర్శకుడు పడ్డ శ్రమ తెరపై కనిపిస్తుంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల అనుభూతి పెరగాలంటే బలమైన బ్యాగ్రౌండ్ సంగీతం ఉండాలి. సునీల్ కశ్యప్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ విభాగం కూడా సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు బావున్నాయి. నిర్మాతలు రాజీ పడ్డట్లు ఎక్కడా అనిపించదు. 

ఫైనల్ పంచ్ : గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రాన్ని క్రైమ్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా చూడదగ్గ చిత్రం 'పరిగెత్తు పరిగెత్తు'.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.