అనుకోకుండా జ‌రిగి పోయింద‌ని అంటున్న హీరోయిన్‌

  • IndiaGlitz, [Sunday,November 17 2019]

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోద‌రి.. హీరోయిన్ ప‌రిణీతి చోప్రా ప్ర‌స్తుతం ఓ బ‌యోపిక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ బ‌యోపిక్ ఎవ‌రిదో కాదు.. ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ది. 'సైనా' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. అమోల్ గుప్తా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ప‌రిణీతి చో్ప్రా గాయ‌ప‌డింది. ఆమె మెడ‌కు గాయ‌మైంది. ఈ విష‌యాన్ని ప‌రిణీతి చోప్రా తెలియ‌జేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌కు గాయ‌మైంద‌ని విష‌యాన్ని పోస్ట్ చేసింది. ''డ్యూడ్స్ 'సైనా' చిత్రీక‌ర‌ణ‌లో గాయాలు కాకూడ‌ద‌ని యూనిట్ ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంది. కానీ అనుకోకుండా జ‌రిగిపోయింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మ‌ళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాను''అని మెసేజ్ పోస్ట్ చేసింది.

నిజానికి సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌లో ముందు శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించాల్సింది. శ్ర‌ద్ధాక‌పూర్ కొన్నిరోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొంది. కానీ డేట్స్ విష‌యంలో స‌ర్దుబాటు చేయ‌లేక‌పోవ‌డం.. మ‌ధ్య‌లో శ్ర‌ద్ధాక‌పూర్‌కి ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో చిత్ర నిర్మాత‌లు శ్ర‌ద్ధాక‌పూర్ స్థానంలో ప‌రిణీతి చోప్రాను ఎంపిక చేసుకున్నారు. షూటింగ్ కూడా స్టార్ట‌య్యింది. ఇప్పుడు ప‌రిణీతికి కూడా గాయ‌మైంది. ఈ సినిమా విడుద‌లను విష‌యంలో నిర్మాత‌లు ఇంకా క్లారిటీకి రాలేదు.

More News

‘పవన్‌.. నీ అసలు పేరేంటి.. ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేవ్!?’

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేడని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

జగన్ చిటికేస్తే.. టీడీపీ అడ్రస్ గల్లంతే.. బాబుకు దమ్ముంటే..!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్క చిటికేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

ఆర్జీవీని ఏమీ చేయలేక నన్ను అంటారేంటి..!?: వంశీ

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

బాలీవుడ్‌ రీమేక్‌లో నాగచైతన్య?

ఈ ఏడాది ‘మజిలీ’తో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్న హీరో నాగచైతన్య ఇప్పుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో

ప్లాప్ డైరెక్టర్ తో వెంకటేష్ అసురన్?

‘ఎఫ్‌2’తో తిరుగులేని విజయాన్ని అందుకున్న హీరో వెంకటేశ్‌ దాని తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.