‘మా’లో తారాస్థాయికి విభేదాలు.. పరుచూరి కంటతడి

  • IndiaGlitz, [Sunday,October 20 2019]

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం నాడు జరిగిన మా అసిసోయేషన్ మీటింగ్ గందరగోళంగా మారింది. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌, రాజశేఖర్ వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో కొందరు సభ్యులు అలిగి సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. సమావేశానికి కోర్టు నుంచి అనుమతి పొందామని రాజశేఖర్ వర్గం చెబుతోంది. మరోవైపు.. ఈ సమావేశం చెల్లదంటూ సభ్యుల ఫోన్లకు నరేష్‌ మెసేజ్‌లు పంపారు.

పరుచూరి కంటతడి!

‘మా’ సభ్యుల మనోగతాన్ని తెలుసుకునేందుకు సమావేశమవుదామంటూ సీనియర్ నటుడు కృష్ణంరాజు సూచించారు. ఈ క్రమంలో.. కొందరు సభ్యులు అలిగి వెళ్లిపోగా.. పరుచూరి గోపాలకృష్ణ కంటతడిపెడుతూ సమావేశం నుంచి వెళ్ళిపోయారు. అయితే పరుచూరి కంటతడి పెట్టడానికి కారణమేంటి..? ఆయన్ను సమావేశంలో ఎవరైనా ఏమైనా అన్నారా..? లేకుంటే మరేం జరిగింది..? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ‘మా’ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. ఈ వివాదాలకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో అని సినీ ఆర్టిస్టుల్లో ఆందోళన నెలకొంది.

More News

వెంకీతో బాలీవుడ్ న‌టుడు

విక్ట‌రీ వెంక‌టేశ్‌, త‌రుణ్ భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ  సినిమాను రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌' సక్సెస్ మీట్

బిజిఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌ బ్యానర్‌ పై ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌'.

కల్కీ ఆశ్రమంలో ముగిసిన ఐటీ రైడ్స్.. షాకింగ్ నిజాలివీ

‘కల్కి’ పేరుతో చిత్తూరు జిల్లాలో వెలిసిన ‘కల్కి భగవాన్‌’ ఆశ్రమంలో గత నాలుగురోజులుగా ఐటీ అధికారులు జరిపిన సోదాలు ముగిశాయి.

పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంపు: ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ

పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంపు విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ రాశారు.

డైరెక్టర్ మారుతీ విడుదల చేసిన 'పరమానందయ్య శిష్యుల కథ' 3డి టీజర్

అలనాటి పరమానందయ్య శిష్యుల కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే, ఈ నేపథ్యంలో పింక్ రోజ్ సినిమాస్ పతాకం పై కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సి హెచ్ కిరణ్ శర్మ నిర్మాతలుగా