ప‌దేళ్ళ ప‌రుగు

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో ప‌రుగు ఒక‌టి. ఆర్య వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత అల్లు అర్జున్‌, నిర్మాత దిల్ రాజు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఇది. అలాగే బొమ్మ‌రిల్లు చిత్రంతో కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ద్వితీయ చిత్రం ఇది.  కుటుంబ క‌థా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ళ మ‌ధ్య అనుబంధాన్ని ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా ఆవిష్క‌రించారు.

షీలా క‌థానాయిక‌గా న‌టించిన ఈ మూవీలో ప్ర‌కాష్ రాజ్‌, జ‌య‌సుధ‌, పూన‌మ్ బ‌జ్వా, సునీల్‌, సప్త‌గిరి, సుబ్బ‌రాజు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ణిశ‌ర్మ సంగీత‌మందించిన ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా న‌మ్మ‌వేమో గానీ అందాల యువరాణి.. పాట అప్ప‌ట్లో పెద్ద హిట్‌గా నిలిచింది. క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించిన ఈ సినిమా.. హిందీలో హీరోపంతి పేరుతో రీమేక్ అయి అక్క‌డా విజ‌యం సాధించింది. 1 మే 2008న విడుద‌లైన ప‌రుగు.. నేటితో ప‌ది సంవ‌త్స‌రాల‌ను పూర్తిచేసుకుంటోంది. 

More News

అయినా పోటీ త‌ప్ప‌డం లేదు

అల్లుడు శీను చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌.

చిరు ట్యాగ్ లైన్‌తో సాయిధ‌ర‌మ్

సుప్రీమ్ త‌రువాత మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. తిక్క‌, విన్న‌ర్‌, న‌క్ష‌త్రం, జ‌వాన్‌, ఇంటిలిజెంట్‌..

అనుకున్న స‌మ‌యానికే ర‌వితేజ సినిమా

మాస్ మ‌హారాజా ర‌వితేజని మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి తీసుకువ‌చ్చిన చిత్రం రాజా ది గ్రేట్‌.

విక్ర‌మ్ కుమార్‌కు నో చెప్పిన నాని

ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. అయితే ఇటీవ‌ల‌ విడుద‌లైన హ‌లో నిరాశ‌ప‌రిచింది.

రామ్‌తో తొమ్మిదేళ్ళ త‌రువాత‌..

యువ క‌థానాయ‌కుడు రామ్ ప్ర‌స్తుతం హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.