'పటాస్' డైరెక్టర్ ఫార్ములా మిస్ కావడం లేదు

  • IndiaGlitz, [Monday,October 12 2015]

2015లో తొలి ఘ‌న‌విజ‌యంగా 'ప‌టాస్' మూవీ క్రెడిట్ ద‌క్కించుకుంది. క‌ళ్యాణ్‌రామ్ కి రాంగ్ టైమ్ న‌డుస్తున్న టైంలో రైట్ రిజ‌ల్ట్ ఇచ్చిన ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి డైరెక్ట‌ర్ గా డెబ్యూ ఇచ్చాడు. ఈ సినిమాతో క‌ళ్యాణ్‌కి ఎంత పేరు వ‌చ్చిందో.. ద‌ర్శ‌కుడు అనిల్‌కి అంతే పేరు వ‌చ్చింది. దీంతో అనిల్ సెకండ్ మూవీపై అంద‌రి దృష్టి ప‌డింది.

దిల్ రాజు నిర్మాత‌గానూ.. సాయిధ‌ర‌మ్ తేజ‌, రాశీ ఖ‌న్నా జంట‌గానూ అనిల్ త‌న ద్వితీయ ప్ర‌య‌త్నాన్ని 'సుప్రీమ్' పేరిట ఇటీవ‌లే ప్రారంభించ‌డ‌మే కాకుండా.. శ‌ర‌వేగంగా రూపొందిస్తున్నాడు కూడా. మొద‌టి సినిమా 'ప‌టాస్'లో స‌క్సెస్ అయిన రెండు అంశాల‌ను రెండో సినిమాలోనూ కంటిన్యూ చేస్తూ స‌ద‌రు ద‌ర్శ‌కుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాడు.

ఇంత‌కీ అవేమిటంటే.. ప‌టాస్‌లో క‌ళ్యాణ్‌ది పోలీస్ పాత్ర అయితే.. ఇందులో హీరోయిన్ రాశిదీ పోలీస్ రోల్‌. ఇక రెండో పాయింట్ ఏమిటంటే.. ప‌టాస్ కోసం క‌ళ్యాణ్ బాబాయ్ బాల‌కృష్ణ పాట ('రౌడీ ఇన్స్ పెక్ట‌ర్‌'లోని 'అరె వో సాంబ‌')ని రీమిక్స్ చేస్తే.. 'సుప్రీమ్' కోసం సాయిధ‌ర‌మ్ మేన‌మామ చిరంజీవి పాట ('య‌ముడికి మొగుడు'లోని 'సుప్రీం హీరో')ని రీమిక్స్ చేయ‌బోతున్నాడట‌. ఈ రెండు సినిమాల‌కూ సాయి కార్తీక్ సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డం విశేషం. ఏదీఏమైనా.. ఫ‌స్ట్ పిక్చ‌ర్‌తో నంద‌మూరి అభిమానుల‌ను ఖుషి చేసిన అనిల్‌.. రెండో సినిమా కోసం అవే ఫార్ములాల‌ను వాడుకుంటూ మెగా ఫ్యాన్స్‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌న్న‌మాట‌.

More News

నయనతార.. మూడోనెల

కోలీవుడ్లో నయన తార పేరు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అక్కడి సినిమాలతోనూ.. లేదంటే అక్కడి సెలబ్రిటీలతో లవ్ ఎఫైర్స్, ఫెయిల్యూర్స్.. ఇలా ఆమె ఏం చేసినా సెన్సేషన్. ఈ మధ్య మాత్రం మిగతా వ్యవహారాల కంటే సినిమాల పరంగానే నయన పేరు తరుచుగా అక్కడ నానుతోంది.

నిహారిక ఎంట్రీ పై చరణ్ కామెంట్..?

మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందనే వార్త అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది.

బాహుబలి 2 పక్కన పెట్టిన రానా..?

బాహుబలి సినిమాలో తన నటనతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో రానా.అందరు బాహుబలి 2ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తుంటే...

ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' ఆడియో విడుదల

నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది.

వినాయక్ కోరిక తీరినట్లయ్యింది

''ఆది''తో దర్శకుడిగా పరిచయమై అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు వి.వి.వినాయక్.