close
Choose your channels

పవన్ 31.. పక్కాగా ఆ ప్రొడ్యూసర్‌తోనేనట..

Wednesday, April 21, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ 31.. పక్కాగా ఆ ప్రొడ్యూసర్‌తోనేనట..

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోరు మాములుగా లేదు. ఓ వైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఊహించని విధంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణాన్ని తెస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రం రిలీజ్ అయింది. ప్రస్తుతం పవన్‌కు కరోనా సోకడంతో కాస్త విరామం తీసుకుంటున్నారు. అయితే ఆయన రెండు సినిమాలు ప్రస్తుతం పట్టాలపై ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ కాగా.. మరో సినిమా మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో పవన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు పట్టాలపై ఉన్నాయి.

ఇక ఇప్పటికే హరీశ్ శంకర్‌తో కూడా సినిమా అనౌన్స్ అయిపోయింది. ‘హరిహర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్’ తర్వాత హరీష్ శంకర్‌తో సినిమాను పవన్ పట్టాలెక్కించనున్నారు. ఇప్పటికే పవన్ కోసం హరీష్ శంకర్ మంచి మాస్ మసాలా కథను సిద్ధం చేసి పెట్టారని టాక్. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ కానీ డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో మూవీ కానీ ఉండనున్నట్టు సమాచారం. అయితే మరో ఆసక్తికర వార్త కూడా వినిపిస్తోంది. పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఆయన 26వ చిత్రం కాగా.. హరీష్ శంకర్‌తో మూవీ 29వది అవుతుంది. ఇక 30వ సినిమా త్రివిక్రమ్ లేదంటే సురేందర్‌రెడ్డితో ఉండే అవకాశం ఉంది.

ఇక ఆసక్తికర విషయమేంటంటే.. పవన్ 31 మాత్రం పక్కాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో ‘రిపబ్లిక్‌’ నిర్మించిన ప్రొడ్యూసర్ జె.పుల్లారావుతోనే ఉంటుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. జె.భగవాన్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న పుల్లారావు.. ఇప్పటికే పవన్‌కి సినిమా కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ వచ్చే ఏడాది డేట్స్ ఇస్తానని మాట కూడా ఇచ్చేశారట. ఇప్పటికే సెట్స్‌పై ఉన్న సినిమాల షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ చేసిన పవన్.. కరోనా నుంచి కోలుకోగానే షూటింగ్‌లపై దృష్టి పెడతారని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జె.పుల్లారావుతో పవన్ సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.