ప‌వ‌న్ 25..మూడు హ్యాట్రిక్స్

  • IndiaGlitz, [Tuesday,October 03 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాల త‌రువాత మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అనిరుద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా విజ‌యం సాధిస్తే.. మూడు ర‌కాల హ్యాట్రిక్ ద‌క్కుతాయి. అదెలాగంటే.. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌కి ఇది హ్యాట్రిక్ ప్ర‌య‌త్నం ఎలాగో.. అలాగే కీర్తి సురేష్ కూడా తెలుగులో న‌టిస్తున్న మూడో చిత్ర‌మిదే. ఆమె న‌టించిన గ‌త రెండు చిత్రాలు నేను శైల‌జ‌, నేను లోక‌ల్ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అదే విధంగా.. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌లో త్రివిక్ర‌మ్‌కిది నాలుగో సినిమా అయినా.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అఆ త‌రువాత వ‌రుస‌గా చేస్తోన్న మూడో సినిమా. సో.. ప‌వ‌న్ 25వ చిత్రం హిట్ అయితే మూడు హ్యాట్రిక్స్ సొంతం అవుతాయ‌న్న‌మాట‌.

More News

మారుతికి క‌లిసొచ్చిన సెంటిమెంట్‌

ఈ రోజుల్లో, బ‌స్‌స్టాప్‌, కొత్త జంట‌, భ‌లే భ‌లే మగాడివోయ్ వంటి వ‌రుస విజ‌యాల త‌రువాత ద‌ర్శ‌కుడు మారుతికి బాబు బంగారం రిజ‌ల్ట్‌ చిన్న షాక్ ఇచ్చింది. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన మ‌హానుభావుడుతో మ‌ళ్లీ ఆయ‌న స‌క్సెస్ బాట ప‌ట్టారు. సెప్టెంబ‌ర్ 29న ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ఈ సినిమాకి తొలి ఆట నుంచే హిట్ టాక్ వ‌చ్చింది.

ర‌వితేజ సినిమాతో హ్యాట్రిక్ కొడ‌తారా?

నాని క‌థానాయ‌కుడుగా న‌టించిన కృష్ణగాడి వీర‌ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది పంజాబీ బ్యూటీ మెహ‌రీన్‌. ఆ  సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి రిజ‌ల్ట్‌ని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం గ్యాప్‌తో వ‌చ్చిన ఆమె రెండో తెలుగు చిత్రం మ‌హానుభావుడు విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌లై విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తోం

మెగాస్టార్ 'మాస్ట‌ర్‌' కి 20 ఏళ్లు

హిట్ల‌ర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌కి స‌క్సెస్‌ఫుల్‌గా శ్రీ‌కారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవికి.. వెనువెంట‌నే ద‌క్కిన మ‌రో సూప‌ర్ స‌క్సెస్ మూవీ మాస్ట‌ర్‌. తెలుగు లెక్చ‌ర‌ర్‌గా చిరు న‌టించిన ఈ సినిమాకి తొలుత నెగ‌టివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇందులో చిరు లుక్‌, స్టైల్‌, డాన్స్‌లు ఆ టాక్‌ని అధిగ‌మించి సూప‌ర్ హిట్ వైపు న‌డిపించాయి.

'రాజుగారిగ‌ది 2' అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ - అక్కినేని నాగార్జున‌

అక్కినేని నాగార్జున‌, స‌మంత‌, శీర‌త్‌క‌పూర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి. బేన‌ర్స్‌పై ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాజుగారి గ‌ది2'. సినిమా అక్టోబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది.

అమెరికా లో బ్రహ్మానందం కి అరుదైన గౌరవం

అక్టోబర్ 6న అమెరికా లోని సియాటెల్ నగరం లో జరుగబోవు  తస్వీర్ 12 వ  సౌత్ ఏషియన్  ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిధిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోమని   ప్రముఖ నటుడు, పద్మశ్రీ  పురస్కార గ్రహీత , వెయ్యి చిత్రాలతో గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసిన డాక్టర్ బ్రహ్మానందం కి ఆహ్వానం అందింది.