ప‌వ‌న్ 27 రిలీజ్ డేట్‌... ఫ్యాన్స్‌కు పండ‌గే..

  • IndiaGlitz, [Saturday,March 07 2020]

తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్‌’ షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. మ‌రో ప‌క్క మ‌హిళా దినోత్స‌వం రోజున ఈ సినిమా నుండి సాంగ్ కూడా విడుద‌ల చేస్తున్నారు. కాగా.. అదే రోజున ప‌వ‌న్ త‌న 27వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఎ.ఎం.ర‌త్నం నిర్మాణంలో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ 27 రూపొంద‌నుంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ప్రారంభం కాబోయే ఈ సినిమా పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంద‌ని టాక్‌. మొఘ‌ల్ పీరియ‌డ్‌లో కోహినూర్ వ‌జ్రం చుట్టూ తిరిగే క‌థ‌తో సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌.

ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల‌వుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేద‌ని ఈ ఏడాదిలోనే ప‌వ‌న్ 27న విడుద‌ల కానుంద‌ని అంటున్నారు. ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా షూటింగ్‌ను ఆగ‌స్ట్‌నాటికంతా పూర్తి చేసేసి దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 13న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇలా ప‌వ‌న్ ఒకే ఏడాదిన రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌డం ఇదేం కొత్త కాదు.. 1998లో ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’తో... 2006లో ‘బంగారం’, ‘అన్నవరం’తోనూ పలకరించాడు. అలాగే 2011లో ‘తీన్ మార్’, 'పంజా'తోనూ... 2012లో ‘గబ్బర్ సింగ్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాలతో సందడి చేశాడు.

More News

'పలాస 1978' థాంక్స్ మీట్

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో

ప్రేక్షకుల కోరిక మేరకు ‘కనులు కనులను దోచాయంటే’ థియేటర్లు పెంచుతున్నాం - కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌

పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకూ... కొన్నేళ్లుగా నిర్మాతలు అనుసరించే సూత్రం ఒక్కటే! వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసి,

‘హిట్’ సినిమా చూసి హానెస్ట్ థ్రిల్లర్ చేశానని ప్రేక్ష‌కులు న‌మ్మారు.. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా నా బాధ్య‌త‌గా మ‌రింత పెరిగింది: డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' షెడ్యూల్ పూర్తి...

ఒకప్పుడు బ్రూస్లీ నటించిన హాలీవుడ్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 13న రిలీజ్ అవుతున్న 'యురేక' అందరికీ నచ్చుతుంది - నిర్మాత బెక్కం వేణుగోపాల్

ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్,డింపుల్ హయతి, సయ్యద్ సోహైల్ రియాన్, షాలిని, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'యురేక'..