అయోధ్య తీర్పుపై జనసేనాని స్పందన ఇదీ...

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే. వివాదాస్పద స్థలం హిందువులకు.. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం అంటూ దశాబ్దాలుగా నెలకొన్న ఈ వివాదానికి ఒకే ఒక్క గంటలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చేసింది. ఈ చరిత్రాత్మక తీర్పు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్విట్టర్, మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ తీర్పుపై పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

పవన్ ట్వీట్ సారాంశం ఇదీ..

‘సాంత్వన కలిగించేలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారత న్యాయవ్యవస్థ స్వచ్ఛమైన విజ్ఞతకు దర్పణం పడుతోంది. ధర్మాన్ని పరిరక్షించేలా తీర్పు ఇచ్చినందుకు సుప్రీం కోర్టుకు భారతీయులుగా తామందరం హృదయపూర్వక సమ్మతి తెలుపుతున్నాము..’ అని పవన్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు చివర్లో ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాన్ని జోడించారు. కాగా పవన్ ట్వీట్‌కు మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కామెంట్స్, షేర్‌లు చేస్తున్నారు. కాగా తీర్పు అనంతరమే భారత ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించిన విషయం విదితమే.

More News

అయోధ్యపై తీర్పు:  ‘జై శ్రీరామ్’.. మీ కొచ్చిన సమస్య ఏంటి?: రష్మి

దశాబ్దాలుగా నెలకొన్న అయోధ్య భూ వివాదంపై నేడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

టీచర్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి

సినిమా రంగంలో సెంటిమెంట్‌ను ఫాలో కానీ వారుండ‌రు. టాప్ స్టార్స్ నుండి చిన్న‌వారు వ‌ర‌కు అంద‌రికీ ఏదో ఓక సెంటిమెంట్ ఉంటుంది.

ప్ర‌భాస్ 'జాన్' లో బాహుబలి సెంటిమెంట్

బాహుబ‌లితో నేష‌న‌ల్ రేంజ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. త‌ర్వాత విడుద‌లైన సాహోతో ఓకే అనిపించుకున్నాడు.

కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ ?

హీరోగా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ స్టార్ హీరోగా కొన‌సాగుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

‘చలో ట్యాంక్‌బండ్’లో కలకలం..  మావోలు రంగంలోకి దిగారా!?

గత కొన్ని రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్‌ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.