పవన్‌-హరీశ్ కాంబోలో సినిమా : మైత్రీ మూవీస్ ప్రకటన

  • IndiaGlitz, [Saturday,February 01 2020]

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమానులకు మైత్రీ మూవీస్ తియ్యటి శుభవార్త అందించింది. పవన్‌తో తమ సంస్థ త్వరలోనే సినిమా చేయబోతోందని అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అయితే.. ఈ సినిమా కూడా ఇదివరకే ‘గబ్బర్ సింగ్’ తెరకెక్కించిన హరీశ్ శంకర్‌‌తో ఈ సినిమా కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులుగా పవన్ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురే.!

‘‘గబ్బర్ సింగ్' చిత్రం తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో రానున్న చిత్రాన్ని మేం తెరకెక్కించబోతుండటం సంతోషంగా వుంది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని ట్విట్టర్ వేదికగా మైత్రీ మూవీస్ ప్రకటన విడుదల చేసింది. కాగా.. పవన్-హరీశ్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాకుండా.. గట్టిగానే కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇప్పటికే ‘పింక్’ రీమేక్, క్రిష్ దర్శకత్వంలో మరో మూవీ ఉండగా.. తాజాగా మైత్రీ మూవీస్ ప్రకటనతో మొత్తం మూడు సినిమాల్లో పవన్ నటించనున్నారన్న మాట.