తెలంగాణ ప్రజలకు బోనాల గిఫ్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Saturday,July 20 2019]

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. బోనాల పండుగ వస్తే చాలు పలు టీవీ చానెళ్లు, ప్రైవేట్ ఆల్బమ్స్ వారు పెద్ద ఎత్తున పాటలు పాడి యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేస్తుంటారు. తాజాగా.. తెలంగాణలో రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్న బోనాల ఉత్సావాల నేపథ్యంలో వారికి పవన్ కల్యాణ్ ఓ ఊహించని గిప్ట్ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభంలా నిలిచే బోనాల పండుగను పురస్కరించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి.

ఇదిలా ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్ పైనే తన దృష్టిని కేంద్రీకరించడం కూడా సమంజసం కాదని.. రానున్న ఎన్నికల నాటిని పార్టీని తెలంగాణలో కూడా బలోపేతం చేసేందుకు గాను పవన్ ఇలా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు.. కార్యకర్తలను పార్టీ క్యాడర్‌ను సిద్దం చేయాలని కూడా వ్యూహాలను రచించే పనిలో పవన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణవాసులతో మమేకం అయ్యేందుకు పవన్ జనసేన తరపున ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.