close
Choose your channels

రాజకీయాలు, సినిమాలతో పవన్ బిజీ బిజీ..

Wednesday, March 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజకీయాలు, సినిమాలతో పవన్ బిజీ బిజీ..

పవన్ కళ్యాణ్‌కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్లలో అభిమానులు ఉన్నారు. ఆయనొక పవర్ స్టార్. రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు సేవ చేయడమనేది తన బాధ్యతగా భావిస్తూ వస్తున్నారు. రాజకీయాలు, సినిమాలను బాలెన్స్ చేసుకుంటూ తనకంటూ ఒక కొత్త బెంచ్ మార్కును సెట్ చేసుకుంటున్నారు. జనసేన అధ్యక్షుడుగా ఆయనలోని మల్టీ టాస్కింగ్ స్కిల్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

నటుడు ఒక రాజకీయ నాయకుడిగా మారి ఆ తరువాత తన రాజకీయ పార్టీకి సంబంధించిన పనులను.. సినిమా షూటింగ్‌లను ఏక కాలంలో ఒక కచ్చితమైన ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌ల సమయంలో రాజకీయాలను పక్కనబెడతారంటూ ఆయనను ఇతర పార్టీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. కానీ ఆయన అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళుతుంటారు.

కాగా.. మంగళవారం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల షూటింగ్‌లలో పవన్ పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ 27 షూటింగ్‌లో పాల్గొన్నారు. క్రిష్ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే.. హైదరాబాద్‌ కొండపూర్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. లొకేషన్స్‌లోనే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తలతో పవన్ చర్చించారు. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు రాజకీయాలతో పవన్ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.