3 ఏళ్ల తరువాత కూడా అలాగే వస్తున్న పవన్

  • IndiaGlitz, [Saturday,September 02 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా అత‌ని 25వ చిత్రం కాన్సెప్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన చిత్ర‌బృందం.. ఓ మ్యూజిక‌ల్ స‌ర్‌ప్రైజ్‌ని కూడా ఇచ్చింది. అందులో జ‌న‌వ‌రి 10న సినిమా రిలీజ్ కానున్న‌ట్లు క్లూ కూడా ఇచ్చారు. విశేష‌మేమిటంటే.. ప‌వ‌న్ గ‌త సంక్రాంతి చిత్రం 'గోపాల గోపాల' కూడా అదే తేదిన విడుద‌లైంది. మ‌ళ్లీ మూడేళ్ల త‌రువాత అదే రోజున ప‌వ‌న్ 25వ చిత్రం విడుద‌ల కానుండ‌డం విశేషం.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఎమ్మానియేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత‌మందిస్తున్నాడు. 'జ‌ల్సా', 'అత్తారింటికి దారేది' వంటి హిట్స్ త‌రువాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

More News

షూటింగ్ పూర్తిచేసుకున్న 'మహనుభావుడు' విజయదశమి కి చిత్రం విడుదల

శర్వానంద్ హీరోగా,మెహరిన్ హీరోయిన్ గా,మారుతి దర్శకత్వంలో

ఈ సారి ఏకంగా మెగాస్టార్ తో..?

తన ఖాతాలో ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా వేసుకోలేకపోయినా..

సాయిధరమ్ పెంచేస్తున్నాడు కానీ..

ఇప్పటివరకు ఏడు చిత్రాల్లో సందడి చేసిన మెగా ఫ్యామిలీ కథానాయకుడు సాయిధరమ్ తేజ్..

పవన్ సినిమాకి త్రివిక్రమ్ సెంటిమెంట్..

'జల్సా','అత్తారింటికి దారేది'వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,

బెల్లంకొండ తరువాత రామ్ చరణ్ తోనే..

సమంత.. ఎంతోమంది యువ కథానాయకులకు కష్ట కాలంలో కలిసొచ్చిన కథానాయిక.