అదే జరిగితే.. రాష్ట్రం రావణకాష్టం అవుతుంది: పవన్

  • IndiaGlitz, [Friday,July 24 2020]

ప్రజలు ఎదురు తిరగట్లేదు.. ఏమీ మాట్లాడట్లేదు అనుకోవడం పొరపాటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 60కి పైగా కేసుల్లో కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం పట్ల ఆయన స్పందించారు. పోలీస్, రెవెన్యూ తదితర యంత్రాగమంతా ప్రభుత్వం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలకడం సరికాదన్నారు. కోర్టులకు స్వయం ప్రతిపత్తి ఉండటంతో కాస్త ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు. ఇంకా పవన్ మాట్లాడుతూ.. ‘‘పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే ఎలా ఉంటుందో అగ్రరాజ్యమైనా అమెరికాలోనే మనం చూశాం. పోలీసు వ్యవస్థే ఉండకూడదన్నంత కోపం అక్కడి ప్రజల్లో వచ్చేసింది.

అలాంటి పరిస్థితే ఇక్కడా రాకూడదని ఏముంది? ప్రభుత్వం ఎవరూ మనకు ఎదురు తిరగరు అనుకోవడం పొరపాటు. క్షేత్ర స్థాయిలో చిన్న మార్పు వస్తే.. అది రావణ కాష్టంలా రాష్ట్రమంతా అంటుకుంటుంది. డీజీపీ వచ్చి మాట్లాడాలి అని కోర్టు అనే వరకూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులకు ఆయన బలై పోతున్నారు. ఈ విషయంలో అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి శిరోముండనం చేయించడం.. వంటి వాటన్నింటికీ చాలా తీవ్ర పరిణామాలుంటాయి. డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కూడా అలాగే ప్రవర్తించారు. ఆయనను పెట్టిన హింస.. ప్రజా ప్రతినిధులకు క్షేమం కాదు’’ అని పవన్ పేర్కొన్నారు.

More News

రానా వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌(ఫ్యాన్ మేడ్)... వేదిక మార‌నుందా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి.

మ‌హేశ్‌కు భారీ ఆఫ‌ర్‌....?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో పిల్ల‌ల‌తో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డుప‌తున్నారు. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈపాటికే ఆయ‌న 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్‌పై ఉండేది.

ప్రియాంక స్థానం కాజ‌ల్ అగ‌ర్వాల్‌..?

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. చంద‌మామ‌లాంటి అమ్మ‌డు న‌చ్చ‌డంతో ఈమెకు తెలుగులో అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి.

చీటింగ్ కేసులో హీరో సూర్య బంధువు.. నిర్మాత జ్ఞాన‌వేల్‌కు కోర్టు స‌మ‌న్లు

తమిళ నిర్మాత జ్ఞాన‌వేల్ రాజాకు మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి రామ‌నాథ పురం పోలీస్ స్టేస‌న్‌లో హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది.

కరోనా దెబ్బకు ‘అవతార్ 2’ వాయిదా

ప్రపంచ సినిమా రంగంపై కరోనా వైరస్ చాలా పెద్ద ఎఫెక్ట్‌ను చూపించింది. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా షూటింగ్స్‌ను కొంద‌రు ధైర్యం చేసి స్టార్ట్ చేసిన‌ప్ప‌టికీ