రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

భారతదేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ అమరావతిలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఈ వేడుకలను జనసేన ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే అంటే జెండా ఎగరేసి, జనగణమన పాడేసి, జై హింద్ చెప్పడం కాదని పవన్ చెప్పుకొచ్చారు. ఆదివారం ఉదయం జనసేన జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ గౌరవ వందనం సమర్పించారు. దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారని, ఆ త్యాగాల గురించి తెలుసుకుంటే మన దేశానికి, జెండాకు మనం ఇచ్చే గౌరవమే వేరుగా ఉంటుందన్నారు. రిపబ్లిక్ డే అంటే ఒక్క రోజు జరుపుకొనే పండగలా కాకుండా.. అనునిత్యం దేశ సమగ్రతను కాపాడుకునే బాధ్యతగా ఉండాలని అన్నారు.

అనుక్షణం మనం కాపాడుకోవాలి!

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘1950వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు మన దేశంలో బ్రిటీష్ చట్టాలన్నీ తొలగిపోయి.. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవ్వడం మొదలైంది. వందలాది సంస్థానాలను తనలో విలీనం చేసుకొని భారతదేశం రిపబ్లిక్ దేశంగా అవతరించింది. మత ప్రాతిపదికన దేశ విభజన జరిగి పాకిస్థాన్ ఏర్పడినప్పుడు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం గొప్పతనం ఏంటంటే అన్ని మతాలు, మత విశ్వాసాలను సమానంగా గౌరవం ఇస్తుంది. కనుకే హిందు రిపబ్లిక్ గా దేశాన్ని ప్రకటించలేదు. ఆ అవసరం పాకిస్థాన్ కు ఉందేమోగానీ, భారతదేశానికి లేదు. మన గుండెల్లోనే సెక్యులరిజం ఉంటుంది. మానవత్వానికి స్పందించే దేశం మనది. ఈ దేశం కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేశారు. వాళ్ల శ్రమతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని అనుక్షణం మనం కాపాడుకోవాలి. దేశ సమగ్రతను కాపాడుకోవడానికి అందరూ బాధ్యతతో వ్యవహరించాలి, అవసరమైన త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలి’ అని పవన్ పిలుపునిచ్చారు.

More News

'ఓ పిట్టక‌థ‌' టైటిల్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన త్రివిక్ర‌మ్‌

కొన్ని క‌థ‌లు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. అతి త‌క్కువ నిడివితో  పెద్ద పెద్ద విష‌యాల‌ను చెబుతుంటాయి. అందుకేనేమో అలాంటి వాటిని పిట్టక‌థ‌లు అంటుంటారు. అలాంటి ఓ ఇంట్ర‌స్టింగ్ పిట్టక‌థ‌ను

బాలీవుడ్ బ్యూటీతో నాగ్‌!

అక్కినేని నాగార్జున మ‌న్మ‌థుడు 2తో ప్రేమ‌లో తాను గ్రీకువీరుడున‌ని చెప్పుకోవాల‌నుకున్నాడు. కానీ ప్రేక్ష‌కులు నిర‌భ్యంత‌రంగా సినిమాను తోసిపుచ్చేశారు. అయితే వెంట‌నే ఏదో సినిమా చేసేయాల‌ని

హైదరాబాద్: ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం

భాగ్యనగరం (హైదరాబాద్) అనేక శతాబ్దాల చరిత్రకు అనవాలు అన్న విషయం తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన వాటికి హైదరాబాద్ ప్రత్యేకతల సమాహారంని చెప్పుకోవచ్చు.

కొత్త రంగంలోకి మెగా ప్రొడ్యూస‌ర్‌

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌లో ఉన్న అగ్ర నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఒక‌రు. సీనియ‌ర్ నిర్మాత‌లు చాలా మంది వారి పంథాలో ముందుకెళ్ల‌డానికే ప్ర‌య‌త్నిస్తుంటారు.

బ‌న్నీ పాఠాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే అంద‌రిలో ఓ ఆస‌క్తి నెల‌కొంది.