close
Choose your channels

కోడి రామకృష్ణ మృతి టాలీవుడ్‌కు తీరని లోటు: పవన్

Friday, February 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోడి రామకృష్ణ మృతి టాలీవుడ్‌కు తీరని లోటు: పవన్

టాలీవుడ్ లెజెండరీ దర్శకులు కోడి రామకృష్ణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణించారని తెలుసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ సందర్భంగా కోడితో మెగా ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. "వందకుపైగా చిత్రాలను రూపొందించిన ఆయన ఇటీవల అస్వస్థతకు లోనయ్యారని తెలిసి తిరిగి కొలుకొంటారు అనుకొన్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

శ్రీ రామకృష్ణ గారి తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో అన్నయ్య చిరంజీవి కథానాయకుడు. నాటి నుంచి విభిన్న చిత్రాలు అందించిన ఆయన విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా రూపొందించడంలోను తన శైలిని చూపించారు. వారి మరణం టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. రామకృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కరాలు జరగనున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.