ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని వాడేసుకుంటున్న నాగ‌శౌర్య‌

  • IndiaGlitz, [Tuesday,January 28 2020]

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ఈ నెల 31న 'అశ్వ‌థ్థామ‌' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప‌వ‌న్ క‌ల్యాణ్ వాయిస్ ఓవ‌ర్‌తోనే స్టార్ట్ అవుతుంద‌ట‌. అదేంటి? ప‌వ‌న్ ఓ చిన్న సినిమాకు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడా? అనే సందేహం క‌లిగింది. కానీ అస‌లు విష‌య‌మేమంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పిన డైలాగ్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంద‌ట‌. అలా నాగ‌శౌర్య ప‌వ‌న్ ఇమేజ్‌ను తన సినిమాకు ఉప‌యోగించుకోవాల‌ని అనుకున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని శౌర్య రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

నాగ‌శౌర్య 'అశ్వ‌థ్థామ‌' సినిమాతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాడ‌ట‌. త‌న ఫ్రెండ్ చెల్లెల‌కు జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని క‌థ‌ను రాసుకున్నాడ‌ట‌. సినిమా కోసం రాసుకున్న క‌థ బాగా క‌నెక్ట్ అయ్యింద‌ట‌. దాంతో పాటు సినిమా చేసే క్ర‌మంలోనూ దానికి బాగా క‌నెక్ట్ అయ్యాడు. అందుక‌నే బాగా మేకోవ‌ర్ అయ్యి సినిమాలో న‌టించాడ‌ట‌. అంతే కాకుండా చెస్ట్‌పై అశ్వ‌థ్థామ అనే టైటిల్‌ను టాటూగా వేయించుకున్నాడ‌ట‌. ర‌మ‌ణ తేజ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

More News

‘మా’ నరేష్‌ను చిరంజీవి ఏం చేయబోతున్నారు!?

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు నరేష్‌ను క్రమ శిక్షణా సంఘం ఏం చేయబోతోంది..? ఆయన్ను తప్పించాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారా..?

మార్చి నెలాఖరులో 'ఏప్రిల్ 28 ఏం జరిగింది?' విడుదల

సరికొత్త కథాంశంతో జనరంజకమైన అంశాలతో రూపొందే సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. వైవిధ్యాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు

'వి' సినిమాలో నాని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అష్టాచ‌మ్మా, జెంటిల్‌మ‌న్ వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో నేచుర‌ల్‌స్టార్ నానిని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

డిస్క‌వ‌రీలో ర‌జినీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కేవ‌లం సినిమాలకే ప‌రిమితం కావ‌డం లేదు. త్వ‌ర‌లోనే డిస్క‌వ‌రీ ఛానెల్‌లో ప్ర‌సారం కాబోయే మేన్ వ‌ర్సెస్ వైల్డ్ సిరీస్‌లో క‌నిపించ‌బోతున్నారు.

రీమేక్‌లో దీపిక‌

దీపిక ప‌దుకొనె త‌దుప‌రి చిత్రానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. హాలీవుడ్‌లో అన్నేహ‌తావే, రాబ‌ర్ట్ డి నీరో న‌టించిన చిత్రం ‘ది ఇంట‌ర్న్‌’.